wonder world 49

నీటిలో నడిచే కారు! నీళ్లలో కారు నడుస్తుందా..? అది సాధ్యమేనా..? స్విట్జర్లాండ్‌కు చెందిన రిన్‌స్పీడ్‌ కంపెనీ ఇలాంటి కారునొకదాన్ని తయారు చేసింది. ఆ కారు పేరు ‘స్కూబా’. ప్రపంచంలో మొట్టమొదటి పర్యావరణ అనుకూల కారు కూడా ఇదే. ఎలాంటి కాలుష్యాన్నీ విడుదల చేయని ఈ కారు విద్యుత్‌తో నడుస్తుంది. రోడ్లపై సాధారణ కార్లమాదిరిగానే దీనిని నడపవచ్చు. నీటిలోనూ దీనిని నడిపించవచ్చు. నీళ్లలో దాదాపు 10 మీటర్ల లోతు (33 అడుగులు)లో ఈ కారును నడపవచ్చు. ఈ కారుకు […]

Advertisement
Update:2015-10-06 18:34 IST

నీటిలో నడిచే కారు!

నీళ్లలో కారు నడుస్తుందా..? అది సాధ్యమేనా..? స్విట్జర్లాండ్‌కు చెందిన రిన్‌స్పీడ్‌ కంపెనీ ఇలాంటి కారునొకదాన్ని తయారు చేసింది. ఆ కారు పేరు ‘స్కూబా’. ప్రపంచంలో మొట్టమొదటి పర్యావరణ అనుకూల కారు కూడా ఇదే. ఎలాంటి కాలుష్యాన్నీ విడుదల చేయని ఈ కారు విద్యుత్‌తో నడుస్తుంది. రోడ్లపై సాధారణ కార్లమాదిరిగానే దీనిని నడపవచ్చు. నీటిలోనూ దీనిని నడిపించవచ్చు. నీళ్లలో దాదాపు 10 మీటర్ల లోతు (33 అడుగులు)లో ఈ కారును నడపవచ్చు. ఈ కారుకు ప్రత్యేకమైన విద్యుత్‌ మోటార్లు ఉన్నాయి. భూమిపై నడిచేటపుడు ఒక మోటారు పనిచేస్తుంది. నీళ్లలో నడిపించాల్సి వచ్చినపుడు మిగిలిన రెండు మోటార్లు పనిచేస్తాయి. కారు బరువును నియంత్రిస్తూ నీళ్లలోనే నడిచేలా ఈ మోటార్లు పనిచేస్తాయి. ఈ కారు తయారు చేయడానికి కార్బన్‌ నానో ట్యూబ్‌లను ఉపయోగించారు. దానివల్ల మామూలు కార్ల కన్నా చాలా తక్కువ బరువుంటుంది. ఇంధనం కూడా బాగా ఆదా అవుతుంది. ఈ కారులో డ్రైవరుతో పాటు మరొకరు కూర్చునే సదుపాయముంది. నీళ్లలో ప్రయాణించేటపుడు ఈ ఇద్దరికీ ఆక్సిజన్‌ అందించేందుకు కారులోనే ప్రత్యేకంగా సిలిండర్లను అమర్చారు.

Tags:    
Advertisement

Similar News