తడిసి ముద్దయిన తిరుపతి...లోతట్టు జలమయం

పుణ్యస్థలి తిరుపతి తడిసి ముద్దయ్యింది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి పట్టణమంతా పూర్తిగా నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కనీసం మూడు అడుగుల మేర నీరు లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయి ఉండడం వల్ల ఆ ప్రాంతాల్లో ఉన్న వారు నరకం అనుభవిస్తున్నారు. ఇళ్ళల్లోకి కూడా నీరు చేరిపోయింది. పార్కింగ్‌ చేసిన వాహనాలన్నీ నీట మునిగి పోయాయి. కార్లు దాదాపు కనిపించనంత మేర మునిగిపోయాయి. ఇక టూ వీలర్స్‌ అయితే పూర్తిగా మునిగిపోయి […]

Advertisement
Update:2015-10-06 18:36 IST
  • whatsapp icon

పుణ్యస్థలి తిరుపతి తడిసి ముద్దయ్యింది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి పట్టణమంతా పూర్తిగా నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కనీసం మూడు అడుగుల మేర నీరు లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయి ఉండడం వల్ల ఆ ప్రాంతాల్లో ఉన్న వారు నరకం అనుభవిస్తున్నారు. ఇళ్ళల్లోకి కూడా నీరు చేరిపోయింది. పార్కింగ్‌ చేసిన వాహనాలన్నీ నీట మునిగి పోయాయి. కార్లు దాదాపు కనిపించనంత మేర మునిగిపోయాయి. ఇక టూ వీలర్స్‌ అయితే పూర్తిగా మునిగిపోయి కనిపించకుండా పోయాయి. రహదారుల్లో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూడా కుప్పకూలిపోయాయి. అసలే యాత్రీకుల రద్దీతో ఉండే ప్రాంతం కావడంతో ఇక్కడకు వచ్చే భక్తులు వర్షంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి తోడు ఘాట్‌ రోడ్డులో కొండ చరియలు విరిగిపడి తిరుమల వెళ్ళే వారికి కూడా ఇబ్బందులు ఎదురవుతుడడంతో యాత్రీకుల పరిస్థితి మరీ భయంకరంగా తయారైంది. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే కరెంట్‌ కూడా లేదు. దీంతో యాత్రీకుల అగచాట్లు చెప్పనలవి కాకుండా ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News