జగ్గీ ఔట్...రాందేవ్ ఇన్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడా తగ్గడం లేదు. ఆర్థిక లోటంటూనే ఆడంబరాల విషయంలో మాత్రం ఖర్చుకు వెనకడడడం లేదు. కొన్ని నెలల క్రితం ఇషా వ్యవస్థాపకుడు జగ్గీవాసుదేవన్‌తో మంత్రులు, ఐఏఎస్‌లకు యోగా శిక్షణా తరగతులు ఇచ్చించారు. తాను కూడా స్వయంగా పాల్గొని యోగాసనాలు, డ్యాన్సులు చేశారు. కేవలం మూడు రోజుల యోగా తరగతులకు మూడు కోట్ల రూపాయలు చెల్లించి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. అంతే కాదు రాజధాని ప్రాంతంలో ఇషా ఫౌండేషన్‌కు 400 ఎకరాల భూమిని […]

Advertisement
Update:2015-10-07 03:43 IST

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడా తగ్గడం లేదు. ఆర్థిక లోటంటూనే ఆడంబరాల విషయంలో మాత్రం ఖర్చుకు వెనకడడడం లేదు. కొన్ని నెలల క్రితం ఇషా వ్యవస్థాపకుడు జగ్గీవాసుదేవన్‌తో మంత్రులు, ఐఏఎస్‌లకు యోగా శిక్షణా తరగతులు ఇచ్చించారు. తాను కూడా స్వయంగా పాల్గొని యోగాసనాలు, డ్యాన్సులు చేశారు. కేవలం మూడు రోజుల యోగా తరగతులకు మూడు కోట్ల రూపాయలు చెల్లించి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. అంతే కాదు రాజధాని ప్రాంతంలో ఇషా ఫౌండేషన్‌కు 400 ఎకరాల భూమిని కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. యోగా దుబారాపై విమర్శలు వచ్చినా ఇప్పుడు మరోసారి అదే పనిచేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు.

డిసెంబర్‌ చివరి వారంలో తుళ్లూరు వేదికగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాని నిర్ణయించిన ప్రభుత్వం… అక్కడే బాబా రామ్‌దేవ్‌తో ఎమ్మెల్యేలకు యోగాలో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. సమావేశాలకు ముందు రోజు గానీ, తర్వాత రోజుగానీ బాబా రామ్‌దేవ్ యోగాసనాలు నేర్పుతారు. రామ్‌దేవ్‌కు ఫీజు కూడా భారీగా ముట్టజెప్పేందుకు సిద్ధమయినట్టు సమాచారం. ఫీజుతో పాటు ఇషా గ్రూప్‌ తరహాలోనే రామ్‌దేవ్ కూడా తన సంస్థ పతాంజలి కోసం భూములు అడిగితే ఇస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

డిసెంబర్‌లో తుళ్లూరులో నిర్వహించే అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లను కూడా కన్సెల్టెన్సీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హాయ్‌ల్యాండ్, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోని ప్రభుత్వ అతిథి గృహాల్లో ఎమ్మెల్యేలకు బస ఏర్పాటు చేయనున్నారు. తుళ్లూరులో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు స్పీకర్‌ ప్రతిపాదన పంపగా అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News