ఇటుకల్లో నిధుల వేట...

ప్రపంచంలోఅత్యున్నత రాజధాని నిర్మిస్తామంటున్న ఏపీ ప్రభుత్వం అందుకు అవసరమైన నిధులు ఎలా సమార్చుకుంటుంది. కేంద్రం నుంచి సాయం అంతంత మాత్రమేనని తేలిపోయిన పరిస్థితుల్లో నిధుల సమీకరణ సాధ్యమేనా? అన్న ప్రశ్నలకు అవునన్న సమాధానం వస్తోంది.  ప్రపంచ దేశాలను చుట్టివస్తున్న చంద్రబాబు, ఆ దేశాల్లో ప్రధాన నగరాలను నిర్మించినపుడు అనుసరించిన విధానాలను ఇక్కడా పాటించేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా నే ఇటుకలను అమ్మి కోట్లు సేకరించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దానికి డిజిటల్ ఇటుకలుగా నామకరణం చేయబోతోంది.  ఏమిటీ డిజిటల్ […]

Advertisement
Update:2015-10-07 10:16 IST
ప్రపంచంలోఅత్యున్నత రాజధాని నిర్మిస్తామంటున్న ఏపీ ప్రభుత్వం అందుకు అవసరమైన నిధులు ఎలా సమార్చుకుంటుంది. కేంద్రం నుంచి సాయం అంతంత మాత్రమేనని తేలిపోయిన పరిస్థితుల్లో నిధుల సమీకరణ సాధ్యమేనా? అన్న ప్రశ్నలకు అవునన్న సమాధానం వస్తోంది. ప్రపంచ దేశాలను చుట్టివస్తున్న చంద్రబాబు, ఆ దేశాల్లో ప్రధాన నగరాలను నిర్మించినపుడు అనుసరించిన విధానాలను ఇక్కడా పాటించేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా నే ఇటుకలను అమ్మి కోట్లు సేకరించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దానికి డిజిటల్ ఇటుకలుగా నామకరణం చేయబోతోంది.
ఏమిటీ డిజిటల్ బ్రిక్స్
డిజిటల్ బ్రిక్స్ అనేవి ప్రస్తుతం ఇంటర్నెట్ గేమ్స్, కంప్యూటర్, మొబైల్ గేమ్స్ లో అనుసరిస్తున్నారు. ఇందులో బ్యాడ్జ్ విధానం ఉంటుంది. అంటే మనం వెచ్చించే డబ్బులను బట్టి మనకు వివిధ రకాల బ్యాడ్జ్ లను కేటాయిస్తారన్నమాట. ఇప్పుడు రాజధాని నిర్మాణంలోనూ ఈ డిజిటల్ ఇటుకల విధానం అమలుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు ఆదేశాలతో ఇప్పటికే ఐటీ, మౌలిక‌ అభివృద్ధి పెట్టుబడులశాఖ, క్రీడా శాఖ అధికారులు ఈ డిజిటల్ బ్రిక్స్ విధానాల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. ఒక్కొక్క ఇటుకను వెయ్యి రూపాయల చొప్పున విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. వాటిని కొన్న వారికి ప్రత్యేక గుర్తింపు చిహ్నాన్ని కూడా ఇచ్చేందుకు రెడీ అవుతోంది.
ఆకర్శనీయమైన‌ బ్యాడ్జీలు
10డిజిటల్ బ్రిక్స్ కొన్నవారికి పింక్ బ్యాడ్జ్, 100 డిజిటల్ ఇటుకలు తీసుకుంటే పసుపురంగు బ్యాడ్జ్ లు కేటాయించాలని నిర్ణయించారు. ఇలా చేయడం వల్ల రాజధాని కోసం ఇటుకలు కొని తామూ భాగస్వాములయ్యాం అన్న భావనతోపాటు బ్యాడ్జీలు ఇవ్వడం మరింత ఉత్సాహపరుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. డిజిటల్ బ్రిక్స్ విధానానికి స్థానిక ప్రజల నుంచే కాకుండా ఎన్ఆర్ఐల నుంచి కూడా భారీ స్పందన వస్తుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే విధివిధానాల రూపకల్పనలో బిజీగా ఉన్న అధికారులు త్వరలోనే ఈ సరికొత్త విధానాన్ని ఆచరణలోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.
మన రాజధాని మన ఆత్మగౌరవం
ఇంతటితో ఏపీ ప్రభుత్వం ఆగడం లేదు. నిధుల వేటలో ఆత్మగౌరవ నినాదాన్ని కూడా తమకు అనుకూలంగా ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతోంది. మన రాజధాని-మన ఆత్మగౌరవం పేరుతోనూ విరాళాలు సేకరించేందుకు ప్లాన్ చేస్తోంది. దీనికి ఉద్యోగులు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలే టార్గెట్ గా ఈ విధానాన్ని ప్రయోగించబోతోంది. దీనికోసం త్వరలో వెబ్‌సైట్‌ ప్రారంభించబోతున్నట్టు సమాచారం. ఇది మీ రాజధాని.. మీరే నిర్మించుకోండి అన్న నినాదాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్తే ఫలితం ఉంటుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు.
బిల్డ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో బాండ్లు
ఇక ప్రముఖ అంత‌ర్జాతీయ న‌గ‌రాలు చికాగో, న్యూయార్క్ నగరాల నిర్మాణంలో పాటించిన విధానాలను అమరావతి నిర్మాణంలోనూ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే బిల్డ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో బాండ్లను జారీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అయితే బాండ్లను జారీచేయాలంటే రిజర్వ్ బ్యాంకు అనుమతి తీసుకోవాల్సి ఉంది. దీంతో ఏపీ రాజధాని నిధుల సమీకరణ కమిటీ అధ్యక్షుడు సుజనా చౌదరి ఇప్పటికే బాండ్ల జారీ అంశాన్ని ఆర్బీఐ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం మీద రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చే సాయంతో సంబంధం లేకుండానే వివిధ మార్గాల ద్వారా నిధుల సమీకరణకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Tags:    
Advertisement

Similar News