అందుకే కవిత గడప దాటింది !: రేవంత్
కేసీఆర్ మోతాదుకు మించి విమర్శలు చేసే రేవంత్ రెడ్డి మరోసారి అంతకు మించిన స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ కూతురు కవితపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. మెదక్ జిల్లా గజ్వేల్‌లో రైతుల కోసం టీడీపీ బీజేపీ నిర్వహించిన మహాధర్నాలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి… రైతులకు ఎందుకు రుణమాఫీ చేయడం లేదని ప్రశ్నించారు. మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ పేరుతో వేల కోట్లు దోచుకునేందుకు సొమ్ములుంటాయి గానీ రైతు రుణమాఫికి డబ్బులుండవా అని ప్రశ్నించారు. ఈ సందర్భంలో ఎంపీ కవితనుద్దేశించి […]
కేసీఆర్ మోతాదుకు మించి విమర్శలు చేసే రేవంత్ రెడ్డి మరోసారి అంతకు మించిన స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ కూతురు కవితపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. మెదక్ జిల్లా గజ్వేల్‌లో రైతుల కోసం టీడీపీ బీజేపీ నిర్వహించిన మహాధర్నాలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి… రైతులకు ఎందుకు రుణమాఫీ చేయడం లేదని ప్రశ్నించారు.
మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ పేరుతో వేల కోట్లు దోచుకునేందుకు సొమ్ములుంటాయి గానీ రైతు రుణమాఫికి డబ్బులుండవా అని ప్రశ్నించారు. ఈ సందర్భంలో ఎంపీ కవితనుద్దేశించి కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతులు చనిపోతున్నారని విరాళాలు ఇవ్వాలంటూ బతుకమ్మ కవితమ్మ జోలి పట్టుకుని బయలు దేరిందన్నారు. ఏ కుటుంబంలోనైనా తండ్రి తాగుబోతోడు, చేతగానోడు, అసమర్దుడో లేక తండ్రి మీద నమ్మకం లేనప్పుడే ఆడబిడ్డ గడప దాటుతుందన్నారు. ఈ రోజు కవిత జోలి పట్టుకుని గడపదాటిందంటే కేసీఆర్ సన్యాసి, అసమర్ధుడు,తాగు బోతు, చేతగానోడు అనేగా అర్థం అన్నారు. లేదా రైతుల చావులను కూడా వ్యాపారం చేసి సంపాదించుకునే ఉద్దేశంతో కవిత జోలి పట్టిందా అని ప్రశ్నించారు.
కన్న కూతురు జోలి పట్టుకుని బజారులో తిరుగుతున్నా స్పందించడం లేదంటే కేసీఆర్ అసలు తండ్రేనా అని ప్రశ్నించారు. కవిత వెంట జోలి పట్టుకుని తిరిగే వాళ్లలో ఒక్కడు కూడా తెలంగాణ వాడుగానీ, ఉద్యోగస్తుడు గానీ, మంచోడు గానీ లేడని రేవంత్ ఆరోపించారు. ఇకపై టీఆర్ఎస్ నేతలెవరైనా గ్రామాల్లోకి వస్తే బట్టలూడదీసి వేపచెట్టుకు కట్టేసి లాగుల్లోకి తొండలు వదలండని రేవంత్ పిలుపునిచ్చారు. గతంలో రజాకార్లను కూడా ఇలాగే లాగుల్లోకి తొండలు వదలి కొట్టేవారని చెప్పారు.