అక్బర్‌పై బిహార్‌లో కేసులు!
వివాదాస్పద నేత, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై బిహార్ పోలీసులు కేసులు నమోదు చేశారు. విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని, నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఆయనపై పలు సెక్షన్ల కింద కిషన్‌గంజ్ జిల్లా పోలీసులు కేసులు పెట్టారు. ఆదివారం రాత్రి కొచ్చాదామన్ నియోజకవర్గ పరిధిలోని సొంటాహాట్ గ్రామంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అక్బర్ ఆవేశపూరితంగా ప్రసంగించారు. సోమవారం ఉదయానికి సమీపంలోని రెండు ప్రార్థనాలయంలో విగ్రహాలు ధ్వంసమై ఉన్నాయి. దీంతో అక్బర్ ప్రసంగం వల్లే గుర్తు తెలియని దుం […]
వివాదాస్పద నేత, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై బిహార్ పోలీసులు కేసులు నమోదు చేశారు. విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని, నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఆయనపై పలు సెక్షన్ల కింద కిషన్‌గంజ్ జిల్లా పోలీసులు కేసులు పెట్టారు. ఆదివారం రాత్రి కొచ్చాదామన్ నియోజకవర్గ పరిధిలోని సొంటాహాట్ గ్రామంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అక్బర్ ఆవేశపూరితంగా ప్రసంగించారు. సోమవారం ఉదయానికి సమీపంలోని రెండు ప్రార్థనాలయంలో విగ్రహాలు ధ్వంసమై ఉన్నాయి. దీంతో అక్బర్ ప్రసంగం వల్లే గుర్తు తెలియని దుం డగులు ఈ చర్యకు పాల్పడి ఉంటారని జిల్లా ఎస్పీ రాజీవ్ రంజన్ తెలిపారు. అక్బర్‌పై సీఆర్‌పీసీ సెక్షన్ 144- నిషేధాజ్ఞల ఉల్లంఘన, రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెంచేలా ప్రసంగించినందుకు సెక్షన్ 153-ఎ, ప్రజాప్రతినిధి అయి ఉండి బాధ్యతారహితంగా ప్రవర్తించినందుకు 188 సెక్షన్ల కింద అక్బర్‌పై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.