wonder world 47

పొట్టి గురువు! పొట్టివాడయితేనేం మహా గట్టివాడు ఆజాద్‌ సింగ్‌. జన్యుపరమైన లోపాలతో ఐదేళ్లకే శరీరం ఎదుగుదల ఆగిపోయింది. ఇపుడు ఆజాద్‌సింగ్‌ వయసు 24 ఏళ్లు. ఎత్తు కేవలం 3 అడుగులు మాత్రమే. శారీరక లోపం ఉన్నా ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలన్న ఆజాద్‌ జీవితాశయం ఫలించడానికి అది ఎలాంటి అడ్డంకీ కాలేదు. హర్యానాలోని బాద్‌షాపూర్‌లో బాలికల కళాశాలలో ఆజాద్‌సింగ్‌ కంప్యూటర్‌ ట్యూటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు అద్బుతమైన టాలెంట్‌ ఉందని, అందుకే విద్యార్థినులు ఆయనను చక్కగా గౌరవిస్తారని కళాశాల ప్రిన్సిపాల్‌ […]

Advertisement
Update:2015-10-04 18:34 IST

పొట్టి గురువు!

పొట్టివాడయితేనేం మహా గట్టివాడు ఆజాద్‌ సింగ్‌. జన్యుపరమైన లోపాలతో ఐదేళ్లకే శరీరం ఎదుగుదల ఆగిపోయింది. ఇపుడు ఆజాద్‌సింగ్‌ వయసు 24 ఏళ్లు. ఎత్తు కేవలం 3 అడుగులు మాత్రమే. శారీరక లోపం ఉన్నా ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలన్న ఆజాద్‌ జీవితాశయం ఫలించడానికి అది ఎలాంటి అడ్డంకీ కాలేదు.
హర్యానాలోని బాద్‌షాపూర్‌లో బాలికల కళాశాలలో ఆజాద్‌సింగ్‌ కంప్యూటర్‌ ట్యూటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు అద్బుతమైన టాలెంట్‌ ఉందని, అందుకే విద్యార్థినులు ఆయనను చక్కగా గౌరవిస్తారని కళాశాల ప్రిన్సిపాల్‌ కల్పనా సింగ్‌ చెప్పారు. కొన్నాళ్ల క్రితం ఆజాద్‌సింగ్‌ ఆ కళాశాలలో కంప్యూటర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌గా చేరాడు. ప్రిన్సిపాల్‌ రూమ్‌లో ఉన్న ఏకైక కంప్యూటర్‌కు ఆయన ఇన్‌చార్జి. ఆజాద్‌ వచ్చిన తర్వాత ఆ కళాశాల రూపమే మారిపోయింది. ఇపుడు కళాశాలలో 22 కంప్యూటర్లు ఉన్నాయి. ప్రత్యేకంగా ఒక కంప్యూటర్‌ ల్యాబ్‌ ఉంది. దానికి ఆయనే ఇన్‌చార్జి, ట్యూటర్‌…. అన్నీ. ఆజాద్‌తో పాటు ఆయన సోదరి లక్ష్మి కూడా పొట్టిగానే ఉంటుంది. వీరిద్దరి ఎదుగుదల ఎందుకు ఆగిపోయిందో తెలుసుకుని తగిన మందులు వాడడం కోసం అనేకమంది డాక్టర్లను సంప్రదించానని, అయినా ఫలితం లేకపోయిందని ఆజాద్‌ తండ్రి బహదూర్‌సింగ్‌ చెప్పారు. అయితే ఇపుడు ఎలాంటి సమస్యా లేదని, తన కొడుకును చూడడానికి, అతనితో ఫొటోలు దిగడానికి తమ ఇంటికి పెద్ద సంఖ్యలో జనం వస్తుంటారని ఆయన అన్నారు. ఆజాద్‌ మరో సోదరి సుమన్‌కు మాత్రం ఎలాంటి శారీరక సమస్యా లేదు. ఆమె వయసు 15 ఏళ్లు. ఆజాద్‌ పనిచేసే కళాశాలలోనే ఆమె చదువుతున్నది. ఆజాద్‌ను రోజూ ఇంటి నుంచి కళాశాలకు, మరలా ఇంటికి తన మోపెడ్‌పై తీసుకువెళ్లి తీసుకురావడం సుమన్‌ పని. భవిష్యత్‌లో ఓ కంప్యూటర్‌ షాపు ప్రారంభిస్తానని, దానిని ట్రెయినింగ్‌ సెంటర్‌గా కూడా అభివృద్ధి చేస్తానని ఆజాద్‌ చెబుతున్నారు. ఆయన కల నిజం కావాలని కోరుకుందాం…

Tags:    
Advertisement

Similar News