wonder world 46

ఇసుక హోటల్‌! వెర్రి వేయివిధాలు.. కాదు కాదు ఆసక్తి అనేక రకాలు అని చెప్పుకుందాం. ఇసుక హోటల్‌ అంటే మరి అంతే కదా… ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి హోటల్‌ లేనేలేదు ఒక్క ఇంగ్లండ్‌లో తప్ప. అక్కడి డోర్సెట్‌లోని వేమౌత్‌ బీచ్‌లో ఈ ఇసుక హోటల్‌ను మనం చూడవచ్చు. ఫోటోల్లో కనిపిస్తున్నట్లు మంచాలు, సోఫాలు అన్నీ ఇసుకతో చేసినవే ఉంటాయి. సెలవులను ఎంజాయ్‌ చేయడానికి సముద్రపు ఒడ్డుకు వచ్చే పర్యాటకుల కోసం ఓ హోటల్‌ కంపెనీ దీనిని రూపొందించింది. […]

Advertisement
Update:2015-10-03 18:34 IST

ఇసుక హోటల్‌!

వెర్రి వేయివిధాలు.. కాదు కాదు ఆసక్తి అనేక రకాలు అని చెప్పుకుందాం. ఇసుక హోటల్‌ అంటే మరి అంతే కదా… ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి హోటల్‌ లేనేలేదు ఒక్క ఇంగ్లండ్‌లో తప్ప. అక్కడి డోర్సెట్‌లోని వేమౌత్‌ బీచ్‌లో ఈ ఇసుక హోటల్‌ను మనం చూడవచ్చు. ఫోటోల్లో కనిపిస్తున్నట్లు మంచాలు, సోఫాలు అన్నీ ఇసుకతో చేసినవే ఉంటాయి. సెలవులను ఎంజాయ్‌ చేయడానికి సముద్రపు ఒడ్డుకు వచ్చే పర్యాటకుల కోసం ఓ హోటల్‌ కంపెనీ దీనిని రూపొందించింది. ఇసుకతో తయారు చేసిన ఈ హోటల్‌లో ఉండాలంటే ఒక రాత్రికి 10 పౌండ్లను చెల్లించాలట. అయితే వర్షం వచ్చి అంతా కొట్టుకుపోతే మాత్రం వారిది బాధ్యత కాదని ముందే చెప్పేస్తారు. అంటే వర్షం రానంత వరకూ మీరు హాయిగా ఇసుక మంచాలపై శయనించవచ్చు. వెయ్యి టన్నుల ఇసుకతో నలుగురు శిల్పులు రోజుకు 14 గంటల చొప్పున ఏడు రోజుల పాటు శ్రమించి ఈ హోటల్‌ను తయారు చేశారు. ఈ హోటల్‌కు పై కప్పు లేదు. పగలు ‘సన్‌ బాత్‌’, రాత్రి పూట ‘నక్షత్ర కాంతులు’ ఉచితం. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఉందండోయ్‌.. ఈ హోటల్‌లో టాయ్‌లెట్‌ సౌకర్యం లేదు. దానికి మీ తిప్పలు మీరు పడాల్సిందే. కండిషన్‌ అప్లయ్‌ అన్నమాట… అన్నిటికీ ఒప్పుకుని 10 పౌండ్లు చెల్లిస్తే ఒక రాత్రంతా ఇసుక తిన్నె… అదేనండీ ఇసుక పాన్పు మీ కోసం రెడీ…..

Tags:    
Advertisement

Similar News