యువత కోసమే హోదాకు ప్రయత్నం: విజయసాయిరెడ్డి

రాష్ట్ర భవిష్యత్‌ కోసం ముఖ్యంగా యువత భవిష్యత్‌ కోసమే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తుందని ఆ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం.. ఈనెల 7నుంచి ప్రతిపక్ష నేత జగన్ చేపడుతున్న దీక్షకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని ఆయన కోరారు. ఈనెల 22న రాజధాని శంకుస్థాపనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు ప్రత్యేకహోదా ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. హోదా కోసం ప్రభుత్వం చేయలేని పనిని […]

Advertisement
Update:2015-10-04 14:23 IST

రాష్ట్ర భవిష్యత్‌ కోసం ముఖ్యంగా యువత భవిష్యత్‌ కోసమే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తుందని ఆ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం.. ఈనెల 7నుంచి ప్రతిపక్ష నేత జగన్ చేపడుతున్న దీక్షకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని ఆయన కోరారు. ఈనెల 22న రాజధాని శంకుస్థాపనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు ప్రత్యేకహోదా ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. హోదా కోసం ప్రభుత్వం చేయలేని పనిని విపక్షంగా తాము చేస్తూ ఉంటే సమర్ధించాల్సిందిపోయి తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయాలు చేయడం సమంజసంగా లేదని ఆయన అన్నారు. పోయినసారి దీక్ష చేయడానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వైఎస్‌ జగన్మోహనరెడ్డి పూనుకున్నప్పుడు ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు కలిగించిందో అందరికీ తెలిసిందేనని, దీన్ని ప్రజలందరూ గమనించారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ఇలాంటి పోకడలు మానకపోతే ప్రజలే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారి బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.

పార్టీకి చెందిన మరో నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాజ్యసభలో ప్రత్యేక హోదా కావాలని డిమాండు చేసినవారే ఇపుడు దాని వల్ల పెద్దగా ఉపయోగం లేదని అంటున్నారని ఇంతకన్నా దారుణ విషయం ఏముంటుందని ప్రశ్నించారు. జగన్‌ దీక్ష 7వ తేదీ ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. దీక్ష ఎక్కడ చేసినా ప్రజల ఆదరణ తమకు ఉంటుందని, ప్రభుత్వం ఒక ప్రదేశాన్ని నిరోదించినంత మాత్రాన జనానికి దూరంగా ఉంటామని భ్రమపడితే ఎలా అని విమర్శించారు. తమ పార్టీకి జన బలమే ముఖ్యమని, అది దండిగా ఉందని ఆయన అన్నారు. ఏపీలో విద్యార్థులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే విచారణల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని బొత్స విమర్శించారు. నారాయణ కాలేజీలో 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాజధాని పేరుతో చంద్రబాబు రాజకీయ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు.

Tags:    
Advertisement

Similar News