wonder world 45

చపాతీలపైనా ప్రకటనలు! కుక్కపిల్ల… అగ్గిపుల్ల… సబ్బుబిళ్ల….కాదేదీ కవితకనర్హం అని మహాకవి శ్రీశ్రీ చెప్పిన విషయాన్ని మన దేశంలో కార్పొరేట్‌ కంపెనీలు బాగా వంటబట్టించుకున్నాయి. కాదేదీ ప్రకటనలకనర్హం అని అవి తిప్పిచెబుతున్నాయి. యాడ్స్‌ కోసం వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో జనం గుమిగూడిన మహాకుంభమేళా సమయంలో ఇక స్పష్టంగా కన్పించింది. అనేక కంపెనీలు కన్నేశాయి. తమ తమ బ్రాండ్ల గురించిన ప్రచారం కోసం రకరకాల ప్రకటనలను గుప్పించాయి. హిందుస్థాన్‌ యూనీ లీవర్‌ది ఇందులో ప్రత్యేక స్థానం. […]

Advertisement
Update:2015-10-02 18:34 IST

చపాతీలపైనా ప్రకటనలు!

కుక్కపిల్ల… అగ్గిపుల్ల… సబ్బుబిళ్ల….కాదేదీ కవితకనర్హం అని మహాకవి శ్రీశ్రీ చెప్పిన విషయాన్ని మన దేశంలో కార్పొరేట్‌ కంపెనీలు బాగా వంటబట్టించుకున్నాయి. కాదేదీ ప్రకటనలకనర్హం అని అవి తిప్పిచెబుతున్నాయి. యాడ్స్‌ కోసం వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో జనం గుమిగూడిన మహాకుంభమేళా సమయంలో ఇక స్పష్టంగా కన్పించింది. అనేక కంపెనీలు కన్నేశాయి. తమ తమ బ్రాండ్ల గురించిన ప్రచారం కోసం రకరకాల ప్రకటనలను గుప్పించాయి. హిందుస్థాన్‌ యూనీ లీవర్‌ది ఇందులో ప్రత్యేక స్థానం. ఎందుకంటే అది తినే చపాతీలపైనా ప్రకటనలు ముద్రించింది మరి.

మన దేశంలో అతిపెద్ద వినియోగ ఉత్పత్తుల సంస్థ అయిన హిందుస్థాన్‌ యూనీ లీవర్‌ సంస్థ క్రియేటివ్‌ ఏజెన్సీ ఓజిలీతో కలసి కుంభమేళా యాత్రికుల కోసం చపాతీల ప్రకటనలను తయారు చేశాయి. కుంభమేళా పరిసరాలలో ఉన్న దాదాపు 100 దాబాలు, హోటళ్లతో అవి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ఆయా దాబాలు, హోటళ్లు భక్తులు తినే చపాతీలపై లైఫ్‌బాయ్‌ ప్రకటనలు ముద్రించాయి. ‘మీరు లైఫ్‌బాయ్‌తో చేతులు కడుక్కున్నారా’ అనే ప్రకటన హిందీలో ముద్రించాయి. ”ఉత్తరభారతంలోనే కాదు మన దేశమంతా చపాతీలు ఆహారంలో భాగమైపోయాయి. ఏం తినాలన్నా చేతులను ఉపయోగించాల్సిందే… కనుక మా ప్రకటన తప్పకుండా చూసితీరాల్సిందే.. అందుకే ఈ యాడ్‌ రూపొందించాం” అంటున్నారు హిందుస్థాన్‌ యూనీలీవర్‌ ప్రతినిధులు. మహా కుంభమేళాకు హాజరైన వారిలో కనీసం 25 లక్షల మందికైనా తమ ప్రకటన చేరి ఉంటుందా? అని వారు చెబుతున్నారు. ఫిబ్రవరి 1న ఈ ప్రచారం ప్రారంభించారు. నెల రోజుల పాటు దీనిని కొనసాగించారు. 30 రోజులలో దాదాపు 25 లక్షల చపాతీలపై యాడ్‌ను ముద్రించినట్లు హిందుస్థాన్‌ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ ప్రకటన కనిపించేలా చపాతీలు తయారు చేయడం కోసం హిందూస్థాన్‌ యూనీలీవర్‌ సంస్థ ప్రత్యేకంగా 100 హీట్‌ స్టాంప్‌లను తయారు చేసింది. పూర్తిగా తయారయిన చపాతీపై ఈ హీట్‌ స్టాంప్‌ను ఉంచి కరెంట్‌ స్విచాన్‌ చేస్తారు. దాంతో ఆ స్టాంప్‌పై అక్షరాలు ఉన్న మేర చపాతీ కొద్దిగా నల్లగా మారి చపాతీపై అక్షరాలు కనిపిస్తాయి. కుంభమేళాలోని 100 దాబాలు, హోటళ్ల కిచెన్లలో ఈ పని చేయడం కోసం హిందూస్థాన్‌ యూనీలీవర్‌ సంస్థ 100 మంది ప్రమోటర్లను ప్రత్యేకంగా నియమించింది. ఏదైనా తినడానికి ముందు మన చేతులను శుభ్రంగా కడుక్కుంటే నూరుశాతం క్రిములను దూరం చేయవచ్చని, దానివల్ల ఎలాంటి వ్యాధులూ దరిచేరకుండా హాయిగా జీవించవచ్చని హిందుస్థాన్‌ యూనీ లీవర్‌ చెబుతోంది. ఇందుకోసమే ప్రత్యేకంగా అది లైఫ్‌బాయ్‌ హ్యాండ్‌వాష్‌ సబ్బులను, లిక్విడ్‌లను తయారు చేస్తోంది. వాటి ప్రమోషన్‌లో భాగంగానే కుంభమేళాలో ఈ యాడ్‌ మేళా.

Tags:    
Advertisement

Similar News