స్పీడ్ పెంచిన భారతీయ జనతాపార్టీ!
భారతీయ జనతాపార్టీ కేంద్రంలో అధికారం చేపట్టిన వెంటనే తీసుకొన్న ముఖ్య నిర్ణయం దక్షిణాది రాష్ట్రాలలో పార్టీని విస్తరించడం. బిజెపి పగ్గాలను అమిత్ షా చేపట్టిన తరువాత బిజెపి బాద్ షా దృష్టంతా దక్షిణాది రాష్ట్రాలైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మొదలైన రాష్ట్రాలపై కేంద్రీకరించాడు. ఆ ప్రయత్నంలో అమిత్ షా మొదట విజయం సాధించాడని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనా కర్ణాటక రాజధాని బెంగుళూరు కార్పోరేషన్ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించింది. ఈ విజయ పరంపరని […]
Advertisement
బిజెపి స్పీడుతో…. టిడిపికి తలనొప్పులు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిత్రపక్షాలుగా ఉన్న టిడిపి, బిజెపిలు ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న 24గంటల కరెంట్, ఫింఛన్లు రెండింతలు చేయడం, రాష్ట్రంలో ఏర్పాటవుతున్న కేంద్ర విద్యాసంస్థలు మొదలైనవన్నీ టిడిపి నాయకులు తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. ఈ దుష్ప్రాచారన్ని పురందేశ్వరి తప్ప… ఇప్పటి వరకు టిడిపి ప్రచారాన్ని ఏఒక్క బిజెపి నాయకుడు ఖండించలేదు. కాని అమిత్ షాతో రాష్ట్ర బిజెపి సీనియర్లు సమావేశమయ్యాక సీన్ మారింది. రాష్ట్రంలో టిడిపితో కలసి ఉన్నా గానీ …తమ పని తాము చేసుకొవాలని బిజెపి నిర్ణయించుకుంది. పేద ప్రజల అభ్యున్నతికి ప్రధాని నరేంద్రమోది ప్రవేశపెడుతున్న సంక్షేమ పధకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం ద్వారా పార్టీని ప్రజలకు చేరువు చేయడం … అదే సమయంలో టిడిపి ప్రభుత్వ విధానలను తప్పు పట్టాలని బిజెపి రాష్ట్ర శాఖ నిర్ణయించుకుంది.
పథకాల ప్రచారానికో వ్యూహం
గత ఎన్నికల్లో టిడిపి, బిజెపిలను పూర్తిగా ఆదరించిన పశ్చిమ గోదావరి జిల్లాల నుంచే బిజెపి తన అడుగులను ప్రారంభించింది. అందుకే నరేంద్రమోదికి ఇష్టమైన స్వచ్ఛభారత్ కార్యక్రమ రాష్ట్ర కన్వీనరుగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన డాక్టరు బాబ్జీని నియమించారు. అదేవిధంగా బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్రంలో 24 గంటల కరెంటు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఏర్పడుతున్న కేంద్ర విద్యాసంస్థలు, ధన్ జన యోజన పధకం, ప్రధాని ముద్రా పధకం, స్వచ్ఛ భారత్ పనులను ప్రజలలోకి తీసుకుపోయే ప్రణాళికా సమావేశాన్ని భీమవరంలో ఎర్పాటు చేశారు.
బిజెపి నాయకులు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పధకాలన్ని కేంద్ర ప్రభుత్వం చలవేనని ప్రజలకు తెలియజేస్తున్నారు.
విమర్శించే బాధ్యత ఓ మంత్రికి అప్పగింత
టిడిపిని విమర్శించే బాధ్యతను టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న పైడికొండల మాణిక్యాలరావుకు అప్పగించారు. ఇది ఆ పార్టీ అనుసరించ దలచుకున్న వ్యూహంలో భాగమే. మంత్రివర్గంలోని వ్యక్తితోనే ప్రభుత్వంపై విమర్శలు చేయిస్తే ప్రజల దృష్టిని సులభంగా ఆకర్షించవచ్చునని కమలనాధుల ఆలోచన. ఇందులో భాగంగానే మంత్రివర్గంలో సభ్యుడైన పైడికొండల మాణిక్యాలరావు టిడిపి నాయకులపై విరుచుకు పడుతున్నాడు. రాష్ట్రానికి ఆయువు పట్టులాంటి పోలవరం పనులు ఆలస్యం అవడానికి… రాష్ట్రంలో ఇసుక, భూ మాఫియా రాజ్యమేలడానికి తెలుగుదేశం నాయకుల తీరే కారణామని పైడికొండలు ఆరోపిస్తున్నాడు. దీన్నిబట్టి చూస్తే రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీని బలపరుచుకోవడానికి… తెలుగుదేశం పార్టీని బద్నాం చేయడానికి కమలనాధులు సిద్ధపడినట్లు కనపడుతుంది.
– సవరం నాని
Advertisement