కేశవ కోసం వైసీపి నుంచి టీడిపి లోకి...

జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వైసీపీని వీడడం దాదాపు ఖాయమైంది. ఆదినారాయణరెడ్డితో చినబాబు లోకేష్ చర్చలు జరిపారని… అటు నుంచి కూడా సానుకూలస్పందన వచ్చిందంటూ కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చేలా జమ్మలమడుగు ఎమ్మెల్యే నోరు విప్పారు. ”దసరా దాకా ఆగండి… తోకలాంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత కార్యకర్తలు, నాయకులు, ఏడ్పులు పెడబొబ్బలు పెడుతున్న వారికి తగ్గట్టుగా నిర్ణయం ప్రకటిస్తా”నని స్పష్టం చేశారు. వైసీపీని వీడుతున్నానని నేరుగా చెప్పకపోయినా ఆయన మాటల ద్వారా ఉద్దేశమేంటో తేలిపోయింది. […]

Advertisement
Update:2015-10-02 05:06 IST

జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వైసీపీని వీడడం దాదాపు ఖాయమైంది. ఆదినారాయణరెడ్డితో చినబాబు లోకేష్ చర్చలు జరిపారని… అటు నుంచి కూడా సానుకూలస్పందన వచ్చిందంటూ కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చేలా జమ్మలమడుగు ఎమ్మెల్యే నోరు విప్పారు. ”దసరా దాకా ఆగండి… తోకలాంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత కార్యకర్తలు, నాయకులు, ఏడ్పులు పెడబొబ్బలు పెడుతున్న వారికి తగ్గట్టుగా నిర్ణయం ప్రకటిస్తా”నని స్పష్టం చేశారు. వైసీపీని వీడుతున్నానని నేరుగా చెప్పకపోయినా ఆయన మాటల ద్వారా ఉద్దేశమేంటో తేలిపోయింది. ”ఎమ్మెల్యే పదవి పెట్టుకునిపోతే అరబొట్టుకు కూడా చెల్లను” అని ఆదినారాయణరెడ్డి అన్నారు. ”ఎమ్మెల్యే పదవిని పెట్టుకుని పోతే” అన్న వ్యాఖ్య ద్వారా ఆయన వైసీపీ నుంచి బయటకు వెళ్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది.

వైసీపీలో మొదటి నుంచి కూడా అసంతృప్తిగానే ఉన్నప్పటికీ ఇప్పుడే పార్టీ వీడే తొందర వెనుక కొన్ని ఒత్తిడిలు పనిచేస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిపాజిట్లు వసూలు చేసిన కేసులో ఇటీవల అరెస్టయిన కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డి, ఆదినారాయణరెడ్డికి స్వయంగా వియ్యంకుడు. సంస్థ ఆస్తులు అమ్మడం ద్వారా డిపాజిట్లు చెల్లించే పనిలో కేశవరెడ్డి ఉండగానే ప్రభుత్వంలోని కొందరు కీలక వ్యక్తులే ఆ ప్రయత్నాలు ముందుకు సాగకుండా అడ్డుపడ్డారని ప్రచారం జరుగుతోంది. ఆస్తులు అమ్మేలోపే కేసులు పెట్టి అరెస్ట్ చేయించారని చెబుతున్నారు. కేశవరెడ్డి విద్యాసంస్థల ఆస్తులను తక్కువ ధరకే కొట్టేసే ఉద్దేశం కూడా దీని వెనుక ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాను టీడీపీలో చేరితే వియ్యంకుడు కేశవరెడ్డికి కూడా మంచి జరుగుతుందని ఆదినారాయణరెడ్డి భావిస్తూ ఉండవచ్చు. ఈ విషయంలో ఇప్పటికే టీడీపీ నేతల నుంచి హామీ కూడా వచ్చిందని ప్రచారం జరుగుతోంది.

దీనికి తోడు వైసీపీలో అసంతృప్తిపరుడిగా ముద్ర వేసుకున్న తర్వాత ఆదినారాయణరెడ్డితో పార్టీ నేతలు సరైన సంబంధాలు నడపడం మానేశారు. పార్టీ అంతర్గత విషయాలు కూడా ఆదినారాయణరెడ్డికి తెలియజేయడం లేదట. ఆదినారాయణరెడ్డి పార్టీ వీడుతున్న విషయంలో వైసీపీ నేతలు ఒక్కశాతం కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయకపోవడం విశేషం. ఇది ఎప్పుడో ఊహించామని చెబుతున్నారు. పార్టీలో అసంతృప్తిపరుడిగా ఆదినారాయణరెడ్డి కొనసాగడం ఆయనతో పాటు పార్టీకి కూడా ఇబ్బందేనని … కాబట్టి ఆయన వెళ్లినా బాధపడాల్సిన పనిలేదంటున్నారు. ఆదినారాయణరెడ్డి పార్టీ వీడితే ఆ తర్వాత జమ్మలమడుగులో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై జగన్‌కు స్పష్టత ఉందని చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News