పోలవరానికి మరణశాసనం?

ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రోజురోజుకు భారమవుతోంది. తాజాగా కళ్లు బైర్లు కమ్మేలా ప్రాజెక్టు అంచనా వ్యయాన్నిపెంచేశారు. ఈపెంపు చూస్తుంటే ప్రాజెక్టును పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతోందా అన్న అనుమానం కలగకమానదు. గతంలో కాంగ్రెస్ పార్టీ పోలవరం అంచనా వ్యయాన్నిపెంచినప్పుడు అవినీతి ఆరోపణలు చేసిన టీడీపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తాను కూడా అదే పనిచేయడం చర్చనీయాంశమైంది. 2015- 16 లెక్కల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయాన్నిపెంచాలన్న నిపుణుల కమిటీ సిఫార్పులకు గురువారం ఏపీ కేబినెట్ ఆమోదం […]

Advertisement
Update:2015-10-02 10:41 IST

ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రోజురోజుకు భారమవుతోంది. తాజాగా కళ్లు బైర్లు కమ్మేలా ప్రాజెక్టు అంచనా వ్యయాన్నిపెంచేశారు. ఈపెంపు చూస్తుంటే ప్రాజెక్టును పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతోందా అన్న అనుమానం కలగకమానదు. గతంలో కాంగ్రెస్ పార్టీ పోలవరం అంచనా వ్యయాన్నిపెంచినప్పుడు అవినీతి ఆరోపణలు చేసిన టీడీపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తాను కూడా అదే పనిచేయడం చర్చనీయాంశమైంది.

2015- 16 లెక్కల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయాన్నిపెంచాలన్న నిపుణుల కమిటీ సిఫార్పులకు గురువారం ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీ అనంతరం వివరాలు వెల్లడించిన జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ… ప్రాజెక్టును పూర్తి చేయాలంటూ 2015- 16 ధరల ప్రకారం 36 వేల కోట్లు అవుతుందని చెప్పి అందరూ ఖంగుతినేలా చేశారు. 2013 బడ్జెట్‌ సమావేశాల్లో అప్పటి ప్రభుత్వం పోలవరం అంచనా వ్యయం 16వేల 10 కోట్లని ప్రకటించింది. అలాంటిది ఈ రెండేళ్లలో ఏకంగా 20 వేల కోట్లు అదనంగా అంచనా వ్యయం పెంచడం అంతుచిక్కడం లేదు.

డ్యాం నిర్మాణ వ్యయం పెరగలేదని.. భూసేకరణ, ముంపు గ్రామాల పునరావాసం ఖర్చే భారీగా పెరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం జాతీయప్రాజెక్టుగా గుర్తింపు పొందిన పోలవరానికి కేంద్ర ప్రభుత్వం ఏడాదికి వంద రెండు వంద కోట్లను విధిలిస్తూ వస్తోంది. అలాంటప్పుడు 36 వేల కోట్ల ప్రాజెక్టు పూర్తి కావడం అయ్యేపనేనా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. పోలవరం ప్రాజెక్టు మరణశాసనం రాసే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ స్థాయిలో అంచనా వ్యయం పెంచిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News