ఇంద్రాణి ఆత్మహత్య యత్నం... పరిస్థితి సీరియస్‌!

ముగ్గురు భర్తలతో కాపురం చేసి… కన్నకూతురు షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలుగా ఆరోపణలు ఎదుర్కొంటూ… దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంద్రాణి ముఖర్జియా ఆత్మహత్య ప్రయత్నం చేసింది. నిద్రమాత్రలు మింగి ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. దీంతో కలవరానికి గురైన పోలీసు అధికారులు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఇరవై నాలుగు గంటలు గడిస్తే తప్ప ఇంద్రాణి పరిస్థితి చెప్పలేమని డాక్టర్లు చెబుతున్నారు. ఆమె తీసుకున్న నిద్ర మాత్రలు ఎంత శక్తిమంతమైనవన్న విషయంపై డాక్టర్లు పరీక్షలు చేస్తున్నారు. జైలులో […]

Advertisement
Update:2015-10-02 16:46 IST

ముగ్గురు భర్తలతో కాపురం చేసి… కన్నకూతురు షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలుగా ఆరోపణలు ఎదుర్కొంటూ… దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంద్రాణి ముఖర్జియా ఆత్మహత్య ప్రయత్నం చేసింది. నిద్రమాత్రలు మింగి ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. దీంతో కలవరానికి గురైన పోలీసు అధికారులు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఇరవై నాలుగు గంటలు గడిస్తే తప్ప ఇంద్రాణి పరిస్థితి చెప్పలేమని డాక్టర్లు చెబుతున్నారు. ఆమె తీసుకున్న నిద్ర మాత్రలు ఎంత శక్తిమంతమైనవన్న విషయంపై డాక్టర్లు పరీక్షలు చేస్తున్నారు. జైలులో ఉన్న ఇంద్రాణికి నిద్ర మాత్రలు ఎలా వచ్చాయన్నది ఇపుడు ప్రధాన ప్రశ్న. పరిస్థితి కొలిక్కి వచ్చి ఆమె ప్రమాదం నుంచి బయటపడితే కథ సుఖాంతమవుతుంది. లేకుంటే ఈ కేసులో పోలీసు అధికారులు జైలు కెళ్ళడం ఖాయంగా కనిపిస్తోంది. అనేక మలుపులు తిరుగుతున్న కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి జైలులో ఉన్నప్పుడు నిద్ర మాత్రలు ఆమె చేతికి వెళ్ళడం… ఆమె ఆత్మహత్యకు పాల్పడడానికి ప్రయత్నించడం… ఇవన్నీ మహారాష్ట్ర పోలీసు అధికారుల మెడకు చుట్టుకునే అంశాలే. అయితే దీనిపై పోలీసుల కథనం మరొక రకంగా ఉంది… ఇంద్రాణికి గుండెపోటు వచ్చిందని, ఆమె ఈ విషయాన్ని తెలిపిన వెంటనే ముంబాయిలోని జెజె ఆస్పత్రికి తీసుకెళ్ళామని చెబుతున్నారు. వైద్యులు పరీక్షలు చేస్తున్నారని జైలు అధికారులు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News