టీడీపీలో చిన్నబుచ్చుకున్న సీనియర్లు

చంద్రబాబు ప్రకటించిన పార్టీ కేంద్ర, ఏపీ, తెలంగాణ కమిటీలపై కొందరు సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఏకంగా మీడియా ముందే తమ కోపాన్ని వెళ్లగక్కుతున్నారు. మాజీ మంత్రి,  తెలంగాణ టీడీపీ నేత పెద్దిరెడ్డి తనను కేంద్ర కమిటిలో అధికార ప్రతినిధిగా సరిపెట్టడంపై షాకయ్యారు. ఇది తనను అవమానించడమేనని ఆయన సన్నిహితుల వద్ద వాపోయారు. తాను తెలంగాణ టీడీపీ ఎన్నికల కమిటీ కన్వీనర్‌గాచేశానని.. ఏపీలో ఇదే ఎన్నికల కమిటీకి కళా వెంకట్రావ్ కన్వీనర్‌గా వ్యవహరించారని గుర్తుచేస్తున్నారు. […]

Advertisement
Update:2015-10-01 09:30 IST
చంద్రబాబు ప్రకటించిన పార్టీ కేంద్ర, ఏపీ, తెలంగాణ కమిటీలపై కొందరు సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఏకంగా మీడియా ముందే తమ కోపాన్ని వెళ్లగక్కుతున్నారు. మాజీ మంత్రి, తెలంగాణ టీడీపీ నేత పెద్దిరెడ్డి తనను కేంద్ర కమిటిలో అధికార ప్రతినిధిగా సరిపెట్టడంపై షాకయ్యారు. ఇది తనను అవమానించడమేనని ఆయన సన్నిహితుల వద్ద వాపోయారు. తాను తెలంగాణ టీడీపీ ఎన్నికల కమిటీ కన్వీనర్‌గాచేశానని.. ఏపీలో ఇదే ఎన్నికల కమిటీకి కళా వెంకట్రావ్ కన్వీనర్‌గా వ్యవహరించారని గుర్తుచేస్తున్నారు. కళాను ఏకంగా ఏపీ టీడీపీకి అధ్యక్షుడిని చేశారని తనను మాత్రం ఇలా చేశారని అసంతృప్తితో ఉన్నారు. తానేమి తెలంగాణ అధ్యక్ష పదవిని ఆశించలేదని… కనీస గౌరవాన్ని ఆశించానని పెద్దిరెడ్డి కొందరు సీనియర్ల వద్ద ఆవేదన చెందారు.
విశాఖకు చెందిన బండారు సత్యనారాయణమూర్తి కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీకి ఉపాధ్యక్షుడిగా చేసిన తనను ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఉపాధక్ష్యుడిగా నియమించడం అంటే తన స్థాయిని తగ్గించడమేనని అంటున్నారు. ఇలా జూనియర్లతో కలిపి వేయడం కన్నా ఏ పదవి ఇవ్వకపోతేనే ఆనందంగా ఉండేవాడినని ఆయన అంటున్నారు.
ఇక గ్రేటర్ హైదరాబాద్‌లోనూ చిచ్చు రేగే సూచనలు కనిపిస్తున్నాయి. పదవిలో నియమించి ఏడాది కూడా గడవకముందే నగర అధ్యక్ష పదవి నుంచి తనను తప్పించడంపై మాజీ మంత్రి కృష్ణయాదవ్ ఆగ్రహంతో ఉన్నారు. ఈయన స్థానంలో మాగంటి గోపినాథ్‌ను నగర అధ్యక్షుడిగా చంద్రబాబు నియమించారు. గోపినాథ్ చంద్రబాబు సొంత సమాజికవర్గం కావడం, వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో సీమాంధ్ర ఓటర్లను ఆకర్శించేందుకే నగర అధ్యక్ష పదవి కట్టబెట్టారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ పరిణామంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కృష్ణయాదవ్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని సమాచారం. త్వరలోనే కార్యకర్తలతో చర్చించి పార్టీలో ఉండాలా వద్దా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటానని కృష్ణయాదవ్ మీడియాతో చెప్పారు.
Tags:    
Advertisement

Similar News