న‌రసింహ‌న్‌తో జ‌గ‌న్ ప్ర‌త్యేక‌ భేటీ

గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ను వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ రాజ్ భ‌వ‌న్‌లో క‌లిశారు. ఈనెల 7న గుంటూరులో ప్ర‌త్యేక హోదా కోసం దీక్ష చేస్తున్న జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌డం చ‌ర్చనీయాంశ‌మైంది. త‌న దీక్ష‌కు ఏపీ ప్ర‌భుత్వం సృష్టిస్తున్న అడ్డంకుల‌ను గ‌వ‌ర్న‌ర్ కు జ‌గ‌న్ వివ‌రించిన‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప్ర‌తిప‌క్షంపై ప్ర‌భుత్వం నిర్భందాన్ని అమ‌లు చేస్తోంద‌ని న‌ర‌సింహ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. దీక్ష స్థ‌లి విష‌యంలో పోలీసులు వ్య‌వ‌హ‌రించిన‌ తీరును ఆయ‌న‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్ర‌త్యేక హోదా […]

Advertisement
Update:2015-10-01 11:05 IST

గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ను వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ రాజ్ భ‌వ‌న్‌లో క‌లిశారు. ఈనెల 7న గుంటూరులో ప్ర‌త్యేక హోదా కోసం దీక్ష చేస్తున్న జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌డం చ‌ర్చనీయాంశ‌మైంది. త‌న దీక్ష‌కు ఏపీ ప్ర‌భుత్వం సృష్టిస్తున్న అడ్డంకుల‌ను గ‌వ‌ర్న‌ర్ కు జ‌గ‌న్ వివ‌రించిన‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప్ర‌తిప‌క్షంపై ప్ర‌భుత్వం నిర్భందాన్ని అమ‌లు చేస్తోంద‌ని న‌ర‌సింహ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. దీక్ష స్థ‌లి విష‌యంలో పోలీసులు వ్య‌వ‌హ‌రించిన‌ తీరును ఆయ‌న‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్ర‌త్యేక హోదా కోసం తాను దీక్ష చేయాల్సిన ప‌రిస్థితుల‌ను జ‌గ‌న్ వివ‌రించిన‌ట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌ను ప్ర‌స్తావించిన‌ట్టు స‌మాచారం. వీటితో పాటు విద్యార్థి యువ‌భేరి స‌మ‌యంలో యూనివ‌ర్శిటీల్లోకి తాను వెళ్ల‌కుండా ప్ర‌భుత్వం అడ్డుప‌డడంపై గ‌వ‌ర్న‌ర్‌కు జ‌గ‌న్ ఫిర్యాదు చేసిన‌ట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఇత‌ర రాజ‌కీయ ప‌రిణామాలు ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చకు వ‌చ్చాయి.

Tags:    
Advertisement

Similar News