ఆరోగ్యం పెరుగు...తుంది!
ప్రతిరోజూ ఆహారంలో పెరుగుని చేర్చుకుంటే వచ్చే ఆరోగ్యపరమైన లాభాలు చాలా ఉన్నాయి… ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడుతుంది. ఇందులో ఉన్న పోషకాలను జీర్ణవ్యవస్థ తేలిగ్గా శోషణ చేసుకుంటుంది. ఇందులో శరీరానికి మేలుచేసే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అది రోగ నిరోధకశక్తిని పెంచుతుంది, శరీరానికి చెడుచేసే బ్యాక్టీరియాను నివారిస్తుంది. పెరుగులో క్యాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకలను, పళ్లను బలంగా ఉంచుతాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎందుకంటే పెరుగుకి రక్తపోటుని అదుపులో ఉంచే శక్తి ఉంది. […]
Advertisement
ప్రతిరోజూ ఆహారంలో పెరుగుని చేర్చుకుంటే వచ్చే ఆరోగ్యపరమైన లాభాలు చాలా ఉన్నాయి…
- ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడుతుంది. ఇందులో ఉన్న పోషకాలను జీర్ణవ్యవస్థ తేలిగ్గా శోషణ చేసుకుంటుంది.
- ఇందులో శరీరానికి మేలుచేసే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అది రోగ నిరోధకశక్తిని పెంచుతుంది, శరీరానికి చెడుచేసే బ్యాక్టీరియాను నివారిస్తుంది.
- పెరుగులో క్యాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకలను, పళ్లను బలంగా ఉంచుతాయి.
- ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎందుకంటే పెరుగుకి రక్తపోటుని అదుపులో ఉంచే శక్తి ఉంది. రక్తనాళాల్లో, శరీరంలో కొవ్వు చేరకుండా నివారించగలుగుతుంది.
- బరువు తగ్గించడంలో తోడ్పడుతుంది. పెరుగులో ఉన్న క్యాల్షియం శరీరంలో కార్టిసాల్ అనే స్టిరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని నియంత్రణలో ఉంచుతుంది. ఈ కార్టిసాల్ ఉత్పత్తి ఎక్కువైనా, సమతౌల్యం కోల్పోయినా జీవనశైలికి సంబంధించిన వ్యాధులు హైపర్ టెన్షన్, ఒబెసిటీ లాంటివి వస్తాయి.
- పెరుగులో ఉన్న విటమిన్ సి, జింక్, క్యాల్షియం జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇందులో ఉన్న యాంటీ ఫంగల్ గుణాలున్న లాక్టిక్ యాసిడ్ కారణంగా దీన్ని తలకు అప్లయి చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.
- కొంతమందికి పాలంటే సరిపడవు. ఇలాంటివారికి పాలలో ఉన్న లాక్టోజ్ అనే ప్రొటీన్ అందదు. వీరు పాలకు బదులు పెరుగు తీసుకుంటే లాక్టోజ్‌ని లాక్టిక్ ఆసిడ్ రూపంలో పొందవచ్చు.
Advertisement