7న జగన్ దీక్షకు స్థలం ఖరారు

ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధికి కీలకమైన ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన దీక్షకు స్థలం ఖరారైంది. గుంటూరు నల్లపాడు రోడ్డులో వైఎస్ జగన్ దీక్ష స్థలాన్ని నిర్ణయించినట్లు పార్టీ ప్రోగ్రాం కన్వీనర్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం బుధవారం గుంటూరులో వెల్లడించారు.  వైఎస్ జగన్ వచ్చేనెల 7వ తేదీన నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నారు. కాగా ఈ నెల 26 నుంచి ప్రారంభం కావలసిన దీక్ష వాయిదా […]

Advertisement
Update:2015-09-29 19:04 IST

ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధికి కీలకమైన ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన దీక్షకు స్థలం ఖరారైంది. గుంటూరు నల్లపాడు రోడ్డులో వైఎస్ జగన్ దీక్ష స్థలాన్ని నిర్ణయించినట్లు పార్టీ ప్రోగ్రాం కన్వీనర్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం బుధవారం గుంటూరులో వెల్లడించారు. వైఎస్ జగన్ వచ్చేనెల 7వ తేదీన నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నారు. కాగా ఈ నెల 26 నుంచి ప్రారంభం కావలసిన దీక్ష వాయిదా వేసుకున్న నేపథ్యంలో దాన్ని తిరిగి వచ్చే నెల 7వ తేదీ నుంచి కొనసాగించాలని నిర్ణయించారు. అయితే దీనికి పోలీసుల అనుమతి అవసరమవుతుంది. దీక్ష స్థలం మార్చుకున్నందున పోలీసుల అభ్యంతర పెట్టే అవకాశాలు తక్కువని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News