రెండేళ్లలో ఎలక్ట్రిక్ బస్సులు: నితిన్ గడ్కరీ
రెండేళ్లలో ఎలక్ట్రికల్ బస్సులు, బైకులను అందుబాటులోకి తెస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. గ్రీన్‌హైవేస్ ఏర్పాటును శాటిలైట్ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. గ్రీన్ హైవేస్-2015 పాలసీ ప్రారంభ వేడుకలో ఆయన మాట్లాడుతూ రోడ్ల విస్తరణతోపాటు చెట్లపెంపకం, చెట్ల తరలింపు, సుందరీకరణ, నిర్వహణకు సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు. రోడ్డు నిర్మాణ సంస్థలు, కాంట్రాక్టర్లు హరిత రహదారుల ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. కాలుష్య రహిత భారత్‌గా మార్చాలంటే పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలన్నారు. ఇందులో భాగంగా రెండేళ్లలో ఎలక్ట్రికల్ […]
Advertisement
రెండేళ్లలో ఎలక్ట్రికల్ బస్సులు, బైకులను అందుబాటులోకి తెస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. గ్రీన్‌హైవేస్ ఏర్పాటును శాటిలైట్ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. గ్రీన్ హైవేస్-2015 పాలసీ ప్రారంభ వేడుకలో ఆయన మాట్లాడుతూ రోడ్ల విస్తరణతోపాటు చెట్లపెంపకం, చెట్ల తరలింపు, సుందరీకరణ, నిర్వహణకు సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు. రోడ్డు నిర్మాణ సంస్థలు, కాంట్రాక్టర్లు హరిత రహదారుల ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. కాలుష్య రహిత భారత్‌గా మార్చాలంటే పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలన్నారు. ఇందులో భాగంగా రెండేళ్లలో ఎలక్ట్రికల్ బస్సులు, బైకులను అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు.
Advertisement