నా అల్లమే పండుతదో ఎండుతదో తెల్వదు: కేసీఆర్
రైతు సమస్యలపై చర్చలో ముఖ్యమంత్రి కేసీఆర్ సుధీర్ఘంగా ప్రసంగించారు. రాష్ట్రంలో రైతుల దుస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి గత ప్రభుత్వాల వైఫల్యమే కారణమన్నారు. సమైక్యపాలనలో సాగునీటి వ్యవస్త కుప్పకూలిందని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 364 విత్తన కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయని… విత్తనరాజధానిగా పేరుగాంచిందన్నారు. అయినా తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని… లోపం ఎక్కడుందో తెలుసుకోవాలన్నారు. తెలంగాణ రైతులు పంటలేసి ఆకాశం వైపు చూడాల్సిన దుస్థితి ఉందన్నారు. ఎవరో ఎందుకు […]
Advertisement
రైతు సమస్యలపై చర్చలో ముఖ్యమంత్రి కేసీఆర్ సుధీర్ఘంగా ప్రసంగించారు. రాష్ట్రంలో రైతుల దుస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి గత ప్రభుత్వాల వైఫల్యమే కారణమన్నారు. సమైక్యపాలనలో సాగునీటి వ్యవస్త కుప్పకూలిందని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 364 విత్తన కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయని… విత్తనరాజధానిగా పేరుగాంచిందన్నారు. అయినా తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని… లోపం ఎక్కడుందో తెలుసుకోవాలన్నారు.
తెలంగాణ రైతులు పంటలేసి ఆకాశం వైపు చూడాల్సిన దుస్థితి ఉందన్నారు. ఎవరో ఎందుకు తాను కూడా 34 ఎకరాల్లో అల్లం పంట వేశానని… వర్షాభావం వల్ల అది పండుతుందో ఎండుతుందో తెలవడం లేదన్నారు. మొట్టమొదటి సారి కరెంట్ సమస్య లేకుండా చర్చ జరుగుతున్న సభ ఇదేనన్నారు . ఆ విషయాన్ని గర్వంగా చెప్పగలుతున్నానన్నారు. చరిత్రలో ఎప్పుడూ చూసినా ఎండిన పంటలతో విపక్షాలు అసెంబ్లీకి వచ్చేవని… కానీ ఈ సారి పరిస్థితి లేకుండా కేవలం ఆరు నెలల్లోనే చేయగలిగామని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి తర్వాత పగటి పూటే 9గంటలు కరెంట్ సరఫరా చేస్తామన్నారు. దయచేసి రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి గట్టేక్కించేందుకు చర్యలు మొదలుపెట్టామన్నారు. కట్టి పుల్లలు పాతి విద్యుత్ తెస్తామని తాను గతంలో అన్నట్టు ఎర్రబెల్లి చెప్పడాన్ని తప్పుపట్టారు. తలకాయ ఉన్న ఏ సీఎం కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయరన్నారు.
మిషన్ ప్రారంభం కాకముందే మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయ అంటూ ప్రచారం మొదలుపెట్టారని ఆక్షేపించారు. మిషన్ కాకతీయకు బయటివారంతా ప్రశంసింస్తుంటే ఇక్కడి వారు మాత్రం విమర్శలు చేస్తున్నారన్నారు. రుణమాఫీ సొమ్ము మొత్తం ఓకేసారి చెల్లించమనడం భావ్యమా అనిప్రశ్నించారు. ఒకేసారి అంత సొమ్ము చెల్లిస్తే మిగిలిన పథకాల పరిస్థితి ఏమవుతుంతో మంత్రులుగా చేసిన కాంగ్రెస్ నేతలకు తెలియదా అని ప్రశ్నించారు. అయినప్పటికీ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులున్నాయని అవి వస్తే ఒకే దఫాలో రైతు రుణమాఫీ చేసేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
Advertisement