అసోంలో పడవ మునక: 50 మంది మృతి, 200 మంది గల్లంతు

అసోంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కామ్రూవ్ జిల్లాలోని కలహీ నదిలో ప్రయాణిస్తున్న ఓ పడవ మునిగిపోయిన ప్రమాదంలో దాదాపు 50 మంది మరణించారు. పడవ నదిలో మునిగిన సమయంలో దాదాపు 200 మందికిపైగా ఉన్నట్లు సమాచారం. చాయగావ్ నుంచి చంపుపరాకు పడవ పందేల కోసం ఈ పడవ బయల్దేరింది. పడవ ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో నది మధ్యలో పడవ ఆగిపోయిందని, అదే స‌మ‌యంలో ప్ర‌మాదం చోటుచేసుకుంద‌ని జిల్లా డిప్యూటీ కమిషనర్ వినోద్ కుమార్ తెలిపారు. […]

Advertisement
Update:2015-09-28 18:37 IST
అసోంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కామ్రూవ్ జిల్లాలోని కలహీ నదిలో ప్రయాణిస్తున్న ఓ పడవ మునిగిపోయిన ప్రమాదంలో దాదాపు 50 మంది మరణించారు. పడవ నదిలో మునిగిన సమయంలో దాదాపు 200 మందికిపైగా ఉన్నట్లు సమాచారం. చాయగావ్ నుంచి చంపుపరాకు పడవ పందేల కోసం ఈ పడవ బయల్దేరింది. పడవ ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో నది మధ్యలో పడవ ఆగిపోయిందని, అదే స‌మ‌యంలో ప్ర‌మాదం చోటుచేసుకుంద‌ని జిల్లా డిప్యూటీ కమిషనర్ వినోద్ కుమార్ తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిలో చాలామంది ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారన్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. పరిమితికి మించి ప్రయాణికుల్ని ఎక్కించుకోవడమే ప్రమాదానికి కారణమై ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎన్ డీ ఆర్ ఎఫ్ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ, గాలింపు చర్యలు చేపట్టాయి.
Tags:    
Advertisement

Similar News