హైదరాబాద్‌కు పెరుగుతున్న బీపీ
కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా(CSI)నిర్వహించిన సర్వేలో ఆందోళనకరమైన అంశాలు వెలుగుచూశాయి. హైదరాబాద్ నగరంలో గత వారం CSI సంస్థ సర్వే నిర్వహించింది. హైదరాబాద్‌వాసులకు బీపీ పెద్ద సవాల్‌గా తయారైందని సర్వేలో తేలింది. నగరంలో 36 శాతం మంది హైబీపీతో బాధపడుతున్నట్టు తేలింది. నగర వ్యాప్తంగా 44 ప్రాంతాల్లో 11 వేల 245 మంది నుంచి వివరాలను సేకరించారు. వారిలో 4వేల 48 మంది బీపీతో బాధపడుతున్నట్టు తేలింది. వీరిలో 25 శాతం మంది 31 నుంచి […]
Advertisement
కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా(CSI)నిర్వహించిన సర్వేలో ఆందోళనకరమైన అంశాలు వెలుగుచూశాయి. హైదరాబాద్ నగరంలో గత వారం CSI సంస్థ సర్వే నిర్వహించింది. హైదరాబాద్‌వాసులకు బీపీ పెద్ద సవాల్‌గా తయారైందని సర్వేలో తేలింది. నగరంలో 36 శాతం మంది హైబీపీతో బాధపడుతున్నట్టు తేలింది.
నగర వ్యాప్తంగా 44 ప్రాంతాల్లో 11 వేల 245 మంది నుంచి వివరాలను సేకరించారు. వారిలో 4వేల 48 మంది బీపీతో బాధపడుతున్నట్టు తేలింది. వీరిలో 25 శాతం మంది 31 నుంచి 45 ఏళ్లలోపు వారున్నారు. హైబీపీతో బాధపడుతున్న వారిలో సగానికి పైగా బాధితులు ఎలాంటి మెడిసిన్ తీసుకోవడం లేదు. నగరంలో ఈ స్థాయిలో బీపీ బాధితుల శాతం ఉండడం ప్రమాదకరమైన అంశమని వైద్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల గుండెజబ్బులు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితికి ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, వేలపాలలేని ఉద్యోగ పనిగంటలే కారణమని వైద్యులు చెబుతున్నారు.
Advertisement