కాశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి నో: ఒబామా

జమ్ముకాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం చేయబోమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్ అంశం భారత్, పాక్ దేశాల మధ్య నెలకొన్న ద్వైపాక్షిక సమస్యే కాబట్టి అందులో తాము తలదూర్చబోమని ప్రధాని నరేంద్రమోడీకి ఒబామా స్పష్టం చేసినట్టు విదేశాంగ శాఖ ప్రతినిధి వికాశ్ స్వరూప్ తెలిపారు. పాక్‌ కోరినట్టు మధ్యవర్తిత్వం నెరపడానికి అదేమీ అంతర్జాతీయ సమస్య కాదని, కేవలం ఇరు దేశాలకు సంబంధించిన అంశమని, వారు కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుందని ఒబామా చెప్పినట్టు స్వరూప్‌ తెలిపారు.

Advertisement
Update:2015-09-28 18:41 IST

Tags:    
Advertisement

Similar News