భారత్లోకి ఆపిల్ 6 ఎస్, 6 ఎస్ ప్లస్!
ప్రపంచ మొబైల్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోన్న ఆపిల్ 6 ఎస్, 6 ఎస్ ప్లస్ ఫోన్లు త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి రానున్నాయి. ఈ మేరకు ఆపిల్ కంపెనీ అధికారక ప్రకటన విడుదల చేసింది. ఈ వర్షన్లు అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైన కేవలం నెలరోజుల తేడాతో భారత్లో విడుదలవడం విశేషం. అక్టోబరు 16 నుంచి ఇవి భారతీయులకు అందుబాటులోకి ఉంచుతున్నట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఒక విధంగా ఈ వర్షన్లకు అంతర్జాతీయంగా.. యమా గిరాకీ ఉంది. […]
Advertisement
ప్రపంచ మొబైల్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోన్న ఆపిల్ 6 ఎస్, 6 ఎస్ ప్లస్ ఫోన్లు త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి రానున్నాయి. ఈ మేరకు ఆపిల్ కంపెనీ అధికారక ప్రకటన విడుదల చేసింది. ఈ వర్షన్లు అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైన కేవలం నెలరోజుల తేడాతో భారత్లో విడుదలవడం విశేషం. అక్టోబరు 16 నుంచి ఇవి భారతీయులకు అందుబాటులోకి ఉంచుతున్నట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఒక విధంగా ఈ వర్షన్లకు అంతర్జాతీయంగా.. యమా గిరాకీ ఉంది. ఆపిల్ 6 ఎస్, 6 ఎస్ ప్లస్ విడుదలైన కేవలం 3 రోజుల్లోనే 1.30 కోట్ల యూనిట్ల పీస్లు అమ్ముడుపోయాయని కంపెనీ వెల్లడించింది. కాకుంటే… వీటి ధర గురించి ఎలాంటి ప్రకటనా వెలువడ లేదు. ఆపిల్ 6 ఎస్ ధర రూ.60 వేలు ఉండవచ్చని, 6 ఎస్ ప్లస్ ధర రూ.68 వేలుగా ఉండవచ్చని భావిస్తున్నారు. ఇటీవల చైనాలో ఇద్దరు యువకులు ఈ ఫోన్లను కొనేందుకు డబ్బలు లేక తమ కిడ్నీలను విక్రయించుకోవాలని చూసిన సంగతి తెలిసిందే! మరి ఆపిల్ ఫోనా..! మజాకా?
Advertisement