wonder world 40
పొడుగు జుట్టు మహిళల గ్రామం పిరుదులు దాటిన జుత్తుండాలన్నది గతంలో వరుల ప్రథమ కండిషన్‌గా ఉండేది. ఇపుడెవరికీ ఆ పట్టింపులే లేవు. బాబ్డ్ హెయిరయినా, పోనీ టెయిలయినా జుట్టు విషయంలో పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలుండడం లేదు. పిల్లదొరికితే చాలనుకునే రోజులివి. అయితే జుట్టు గురించి ఆసక్తి ఉన్నవారందరూ చదవాల్సిన కథనమిది. చైనాలోని ఓ గ్రామంలో మహిళలందరికీ ఒత్తుగా నిగనిగలాడే జుత్తు పొడవుగా పెరుగుతున్నదట. అక్కడి లోంగ్జి రాష్ట్రంలోగల హువాంగ్లువో గ్రామంలో మహిళలు పొడవాటి జుట్టుగలిగిన వారిగా గుర్తింపుపొందారు. […]
పొడుగు జుట్టు మహిళల గ్రామం
పిరుదులు దాటిన జుత్తుండాలన్నది గతంలో వరుల ప్రథమ కండిషన్‌గా ఉండేది. ఇపుడెవరికీ ఆ పట్టింపులే లేవు. బాబ్డ్ హెయిరయినా, పోనీ టెయిలయినా జుట్టు విషయంలో పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలుండడం లేదు. పిల్లదొరికితే చాలనుకునే రోజులివి. అయితే జుట్టు గురించి ఆసక్తి ఉన్నవారందరూ చదవాల్సిన కథనమిది. చైనాలోని ఓ గ్రామంలో మహిళలందరికీ ఒత్తుగా నిగనిగలాడే జుత్తు పొడవుగా పెరుగుతున్నదట. అక్కడి లోంగ్జి రాష్ట్రంలోగల హువాంగ్లువో గ్రామంలో మహిళలు పొడవాటి జుట్టుగలిగిన వారిగా గుర్తింపుపొందారు. ఈ గ్రామానికి ‘పొడవైన జుట్టు గ్రామం’గా కూడా పేరుంది. ఇక్కడి మహిళల జుట్టు సగటున 1.7 మీటర్ల పొడవు పెరుగుతుంది. వీరిలో ఓ మహిళ జుట్టు 2.1 మీటర్ల పొడవు పెరిగింది. అందుకే ఈ గ్రామం రికార్డు పుటల్లోకి ఎక్కింది. ప్రపంచంలో మొట్టమొదటి ‘లాంగ్ హెయిర్ విలేజ్’గా గిన్నిస్ బుక్‌వారు ఈ గ్రామం పేరును నమోదుచేశారు.