విశాఖకు శాపంగా మారిన ఓపెన్ డ్రెయినేజి

“విశాఖపట్నం.. విశాఖపట్నం..  నీగ్రో స్త్రీ బుగ్గల్లా నిగనిగలాడే తారు రోడ్లు .. జానెడంత సందుల్లో గోదావరంత కాలవలు”  అని చాలా ఏళ్ళ కిందట శ్రీరంగం నారాయణ బాబు విశాఖపట్నాన్ని గురించి చెప్పారు.  ఆయన చెప్పి ఏళ్ళు గడిచినా పరిస్థితిలో ఇంకా ఎలాంటి మార్పు రాలేదు.  ఈ లోగా పెట్టి పుట్టిన నగరం, ఉక్కునగరం, మహానగరం అనే పేర్లు వచ్చాయి.  ఆసియాలోనే శరవేగంతో అభివృద్ధి చెందుతున్న మహానగరాల సరసన విశాఖ కూడా చేరింది.  ఇప్పుడు తాజాగా స్మార్ట్ సిటీ […]

Advertisement
Update:2015-09-28 15:32 IST

“విశాఖపట్నం.. విశాఖపట్నం.. నీగ్రో స్త్రీ బుగ్గల్లా నిగనిగలాడే తారు రోడ్లు .. జానెడంత సందుల్లో గోదావరంత కాలవలు” అని చాలా ఏళ్ళ కిందట శ్రీరంగం నారాయణ బాబు విశాఖపట్నాన్ని గురించి చెప్పారు. ఆయన చెప్పి ఏళ్ళు గడిచినా పరిస్థితిలో ఇంకా ఎలాంటి మార్పు రాలేదు. ఈ లోగా పెట్టి పుట్టిన నగరం, ఉక్కునగరం, మహానగరం అనే పేర్లు వచ్చాయి. ఆసియాలోనే శరవేగంతో అభివృద్ధి చెందుతున్న మహానగరాల సరసన విశాఖ కూడా చేరింది. ఇప్పుడు తాజాగా స్మార్ట్ సిటీ అనే విశేషణం కలిసింది. పాలకులు, రాజకీయ నాయకులు విశాఖ గురించి ఎన్నో రంగుల కళలు చూపిస్తున్నారు. కాని పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని చెప్పడానికి గత వారం ట్యూషన్ నుంచి ఇంటికి తిగిరి వెళుతున్న ఐదేళ్ళ చిన్నారి అదితి కాలువలో పడి మరణించిన దుర్ఘటన విశాఖ తాజా పరిస్థితికి అడ్డం పడుతోంది. చిన్న జాలరి గ్రామమైన విశాఖ కాలక్రమేణా వివిధ కారణాల వల్ల మహానగరమైంది. దానికి తగిన రీతిలో మౌలిక సౌకర్యాలు పెరగలేదు. దానికి తోడు నగరంలో కాలువలు, గెడ్డలు ఆక్రమణకు గురయ్యాయి. ఓపెన్ డ్రెయినేజి కారణంగా కాలువల పైన సిమెంట్ పలకలు అమర్చుతారు. చెత్తను తొలగించడానికి వాటిని తీసి కప్పకుండా వదిలేస్తుంటారు. కాలువల మధ్య గ్రిల్స్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వుంది. అది అమలు జరగలేదు. నగరంలో అనేక మురుగు నీటి కాల్వల్లో చెత్త పేరుకుపోవడం వల్ల దోమలు, ఈగలకు పెంపుడు కేంద్రాలుగా, పందులకు విహార క్షేత్రాలుగా మారుతున్నాయి. కాలువలు, గెడ్డలపై గ్రిల్స్ వేస్తే కొంత మేరకు ప్రయోజనం ఉంటుందని జనం కోరుకుంటున్నారు. నగరంలో డ్రెయినేజి వ్యవస్థను మెరుగు పరిస్తే ముందు ముందు మరిన్ని దుర్ఘటనలు జరగకుండా నివారించవచ్చు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు మేల్కొంటారా?

Tags:    
Advertisement

Similar News