అమ్మ గుర్తుకొచ్చిన వేళ- మోదీ కన్నీరు
ఎప్పుడూ గంభీరంగా కనిపించే ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో తన సున్నితమనస్తత్వాన్ని బయటపెట్టారు. ఫేస్ బుక్ చిట్ చాట్‌లో పాల్గొన్న మోదీ ఓ సందర్భంలో కన్నీటిని ఆపుకోలేకపోయారు. మీ జీవితంలో మీ తల్లి పాత్ర ఏంటని అడిగిన ప్రశ్నతో మోదీ హావభావాలు ఒక్కసారిగా మారిపోయాయి. తనను పెంచేందుకు తల్లిపడ్డ కష్టాలు తలుచుకుని కంటతడిపెట్టారు. తన జీవితంలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకమైనదన్నారు. తమది చాలా నిరుపేద కుటుంబమని… తాను రైల్వే స్టేషన్లో టీ అమ్మేవాడినని గుర్తు చేసుకున్నారు. […]
Advertisement
ఎప్పుడూ గంభీరంగా కనిపించే ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో తన సున్నితమనస్తత్వాన్ని బయటపెట్టారు. ఫేస్ బుక్ చిట్ చాట్‌లో పాల్గొన్న మోదీ ఓ సందర్భంలో కన్నీటిని ఆపుకోలేకపోయారు.
మీ జీవితంలో మీ తల్లి పాత్ర ఏంటని అడిగిన ప్రశ్నతో మోదీ హావభావాలు ఒక్కసారిగా మారిపోయాయి. తనను పెంచేందుకు తల్లిపడ్డ కష్టాలు తలుచుకుని కంటతడిపెట్టారు. తన జీవితంలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకమైనదన్నారు. తమది చాలా నిరుపేద కుటుంబమని… తాను రైల్వే స్టేషన్లో టీ అమ్మేవాడినని గుర్తు చేసుకున్నారు. చిన్న పిల్లలైన తమకు పెంచేందుకు అమ్మ చుట్టుపక్కల ఇళ్ళలో పని మనిషిగా ఉండేదన్నారు. పక్కిళ్లలో అంట్లు తోమేదని చెప్పారు.
తన తల్లే కాకుండా భారతదేశంలో ఎంతో మంది తల్లులు తమ పిల్లలను పెంచేందుకు తమ జీవితం మొత్తం త్యాగం చేస్తున్నారని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్ తల్లిదండ్రులను మోదీ ప్రశంసించారు. ‘‘మీ అబ్బాయి మొత్తం ప్రపంచాన్నే మార్చేశాడు’’ అని కితాబు ఇచ్చారు. అందరూ చూసేందుకు వారిని లేచి నిలబడాల్సిందిగా కోరారు.