సుబ్రమణ్యాన్ని చూసి ఫిదా అయిపోయిన బన్నీ
బన్నీని డైరక్ట్ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు హరీష్ శంకర్. కానీ ఇప్పటివరకు అ అవకాశం అతడ్ని వరించలేదు. తాజాగా సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా చేశాడు హరీశ్ శంకర్. బన్నీ రిలెటివ్, సాయిధర్మతేజ నటించిన ఈ సినిమా అల్లు అర్జున్ కు బాగా నచ్చింది. భార్యతో కలిసి ఈ సినిమా చూసిన బన్నీ.. హరీష్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. దీంతో మరోసారి తన మనసులో మాట బన్నీకి చెప్పాడట హరీష్. కుదిరితే ఓ సినిమా చేద్దామని రిక్వెస్ట్ […]
Advertisement
బన్నీని డైరక్ట్ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు హరీష్ శంకర్. కానీ ఇప్పటివరకు అ అవకాశం అతడ్ని వరించలేదు. తాజాగా సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా చేశాడు హరీశ్ శంకర్. బన్నీ రిలెటివ్, సాయిధర్మతేజ నటించిన ఈ సినిమా అల్లు అర్జున్ కు బాగా నచ్చింది. భార్యతో కలిసి ఈ సినిమా చూసిన బన్నీ.. హరీష్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. దీంతో మరోసారి తన మనసులో మాట బన్నీకి చెప్పాడట హరీష్. కుదిరితే ఓ సినిమా చేద్దామని రిక్వెస్ట్ చేశాడట. ఈసారి మాత్రం బన్నీ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడు. తన ఇమేజ్, బాడీ లాంగ్వేజ్ కు సూటయ్యే కథ ఉంటే తీసుకురమ్మని పురమాయించాడట. దీంతో హరీష్ శంకర్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ప్రస్తుతం బన్నీ కోసం కథ రాసే పనిలో బిజీగా ఉన్నాడు ఈ గబ్బర్ సింగ్ దర్శకుడు. హరీష్ రాసుకుంటున్న కథ కనుక నచ్చితే బన్నీ ఓకే చెబుతాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు అనే సినిమా చేస్తున్నాడు బన్నీ. హరీష్ ప్రాజెక్ట ఓకే అయితే.. బోయపాటి సినిమా తర్వాత అదే ఉంటుంది.
Advertisement