wonder world 39

ఆసియాలోనే ఎక్కువమంది కోటీశ్వరులు ప్రపంచంలో ఎక్కువమంది కోటీశ్వరులు ఆసియా ఖండంలోనే ఉన్నారట. గతంలో ఉత్తర అమెరికాలో ఎక్కువ మంది సంపన్నులుండేవారు. ఇపుడు ఆ ఘనతను ఆసియా కొట్టేసింది. చైనాకు చెందిన ఓ వెల్త్‌ మ్యాగజీన్‌ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్‌ డాలర్లు (రూపాయలలో చెప్పాలంటే దాదాపు 55 కోట్ల రూపాయలు) ఆస్తులు దాటిన వారి సంఖ్య 1,453 మందిగా చైనా వెల్త్‌ మ్యాగజైన్‌ హోరన్‌ అంచనా వేసింది. […]

Advertisement
Update:2015-09-26 18:34 IST

ఆసియాలోనే ఎక్కువమంది కోటీశ్వరులు

ప్రపంచంలో ఎక్కువమంది కోటీశ్వరులు ఆసియా ఖండంలోనే ఉన్నారట. గతంలో ఉత్తర అమెరికాలో ఎక్కువ మంది సంపన్నులుండేవారు. ఇపుడు ఆ ఘనతను ఆసియా కొట్టేసింది. చైనాకు చెందిన ఓ వెల్త్‌ మ్యాగజీన్‌ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్‌ డాలర్లు (రూపాయలలో చెప్పాలంటే దాదాపు 55 కోట్ల రూపాయలు) ఆస్తులు దాటిన వారి సంఖ్య 1,453 మందిగా చైనా వెల్త్‌ మ్యాగజైన్‌ హోరన్‌ అంచనా వేసింది. అందులో ఆసియాలో 608 మంది, ఉత్తర అమెరికాలో 440 మంది, ఐరోపాలో 324 మంది ఉన్నారట. ప్రపంచంలో అత్యంత సంపన్నులైన కోటీశ్వరులు ఎక్కువ మంది ఉన్న ఖండంగా ఆసియాకు మొదటి స్థానం లభించడం ఇదే ప్రథమం. అయితే అమెరికా వాణిజ్య మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ అంచనా మరో విధంగా ఉంది. గత ఏడాది మార్చి నాటికి ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో 315 మంది, ఉత్తర అమెరికాలో 450 మంది, ఐరోపాలో 310 మంది అత్యంత సంపన్నులైన కోటీశ్వరులున్నారని అది అంచనా వేసింది. రెండు మ్యాగజైన్ల అంచనాలకు మధ్య 10 నెలల తేడా ఉంది. ఇక దేశాల విషయానికొస్తే చైనా మ్యాగజైన్‌ అంచనా ప్రకారం మొట్టమొదటి స్థానాన్ని అమెరికా ఆక్రమిస్తున్నది. అమెరికాలో ఏకంగా 408 మంది కోటీశ్వరులున్నారు. తర్వాత స్థానం చైనాది. ఇక్కడ 317 మంది కోటీశ్వరులున్నారు. రష్యా, జర్మనీ, భారత్‌లు ఆ తర్వాత స్థానాలు ఆక్రమిస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత ధనవంతుడు 73 ఏళ్ల మెక్సికో టెలికం దిగ్గజం కార్లోస్‌ స్లిమ్‌. ఆయన ఆస్తులు 66 బిలియన్‌ డాలర్లు. 2013 ఫోర్బ్స్‌ పత్రిక సర్వేలో కూడా స్లిమ్‌ ప్రథమ స్థానంలో నిలిచాడు. అమెరికా బడా పెట్టుబడిదారుడు వారెన్‌ బఫెట్‌ రెండో స్థానంలోనూ, స్పెయిన్‌కు చెందిన ఫ్యాషన్‌ బ్రాండ్‌ జారా అధిపతి అమాన్సియో ఓర్టెగా మూడో స్థానంలోనూ నిలిచారు. బఫెట్‌ ఆస్తులు 58 బిలియన్‌ డాలర్లుగానూ, ఓర్టెగా ఆస్తులు 55 బిలియన్‌ డాలర్లుగానూ హూరన్‌ పత్రిక అంచనా వేసింది. హాంకాంగ్‌కు చెందిన పెట్టుబడిదారు లి కాషింగ్‌ ఆసియాలోకెల్లా అత్యంత ధనవంతుడిగా ప్రథమస్థానం దక్కించుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే జాబితాలో ఈయనది 7వస్థానం. ఈయన ఆస్తులు 32 బిలియన్‌ డాలర్లు. అత్యంత సంపన్నులైన టాప్‌ 100 జాబితాలో మరో ఇద్దరు చైనా కోటీశ్వరులు కూడా చోటు దక్కించుకున్నారు. వహాహా కూల్‌డ్రింక్స్‌ యజమాని జాంగ్‌ క్వింగూ, ప్రముఖ ప్రాపర్టీ డెవవలపర్‌ వాంగ్‌ జియాన్‌లిన్‌లు టాప్‌ 100లో ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News