నేడే నారింజరంగు చంద్ర దర్శనం..
ఖగోళ చరిత్రలో ఆదివారం రాత్రి ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. గత 33 ఏండ్లలో ఎన్నడూ జరగనిది.. మరో 18ఏండ్ల వరకు జరిగే అవకాశం లేని మహాద్భుత దృశ్యం దర్శనమివ్వనుంది. అదే.. సూపర్ బ్లడ్‌మూన్. భూమికి, చంద్రుడికి మధ్య సాధారణంగా ఉండే దూరం బాగా తగ్గిపోయినప్పుడు ఏర్పడేదే సూపర్ మూన్. అయితే ఈ సందర్భంగా సూపర్‌మూన్, చంద్రగ్రహణం ఒకేసారి సంభవించనున్నాయి. ఆదివారం రాత్రి సంభవించనున్న చంద్రగ్రహణం సమయంలో భూమి నీడ సాధారణంగానే చంద్రుడిని కప్పేయనుండగా.. సూపర్‌మూన్ […]
Advertisement
ఖగోళ చరిత్రలో ఆదివారం రాత్రి ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. గత 33 ఏండ్లలో ఎన్నడూ జరగనిది.. మరో 18ఏండ్ల వరకు జరిగే అవకాశం లేని మహాద్భుత దృశ్యం దర్శనమివ్వనుంది. అదే.. సూపర్ బ్లడ్‌మూన్. భూమికి, చంద్రుడికి మధ్య సాధారణంగా ఉండే దూరం బాగా తగ్గిపోయినప్పుడు ఏర్పడేదే సూపర్ మూన్. అయితే ఈ సందర్భంగా సూపర్‌మూన్, చంద్రగ్రహణం ఒకేసారి సంభవించనున్నాయి. ఆదివారం రాత్రి సంభవించనున్న చంద్రగ్రహణం సమయంలో భూమి నీడ సాధారణంగానే చంద్రుడిని కప్పేయనుండగా.. సూపర్‌మూన్ నేపథ్యంలో చంద్రుడిపై కొంత సూర్యకాంతి పడనుంది. దీంతో చందమామ నారింజ రంగులో మెరిసిపోతూ కనిపించనుంది.
Advertisement