సుజనా చౌదరికి చెక్ పెడుతున్న చంద్రబాబు!

కేంద్ర సహాయమంత్రి సుజనా చౌదరికి… చంద్రబాబునాయుడు చెక్ పెట్టనున్నాడా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సహజ లక్షణమైన వాడుకొని వదిలేసే గుణాన్ని ఆయన మరోసారి బయట పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్షంలో ఉంది. ఆ సమయంలో టిడిపికి సుజనా చౌదరి, సిఎం రమేష్ ఆర్ధికంగా అండదండలందించారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు టిడిపి అధికారంలో ఉంది. ఇంక సుజనా… రమేష్ […]

Advertisement
Update:2015-09-27 09:32 IST
కేంద్ర సహాయమంత్రి సుజనా చౌదరికి… చంద్రబాబునాయుడు చెక్ పెట్టనున్నాడా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సహజ లక్షణమైన వాడుకొని వదిలేసే గుణాన్ని ఆయన మరోసారి బయట పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్షంలో ఉంది. ఆ సమయంలో టిడిపికి సుజనా చౌదరి, సిఎం రమేష్ ఆర్ధికంగా అండదండలందించారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు టిడిపి అధికారంలో ఉంది. ఇంక సుజనా… రమేష్ అవసరం లేదనుకున్న చంద్రబాబు వారిని దూరం పెట్టాలనే నిర్ణయానికొచ్చాడు.
అవసరం తీరాక తెప్పతగలేసే బాబు!
పార్టీకి ఎంతగానో ఉపయోగపడ్డాం కదా… ఇంక ప్రభుత్వంలో తిరుగులేదనుకున్న సిఎం రమేష్‌కు చంద్రబాబు పెద్ద ఝలక్ ఇచ్చారు. రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంటుగా సిఎం రమేష్ ఎన్నికయే సందర్భంలో… ప్రస్తుత గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ ను చంద్రబాబు రంగంలోకి దింపి సిఎం రమేష్‌కు షాక్ ఇచ్చారు. ఈ విషయంలో సిఎం రమేష్ ఎన్నిసార్లు చంద్రబాబుని కలసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ పరిణామంతో పార్టీ నాయకులకు… కార్యకర్తలకు పార్టీలో సిఎం రమేష్‌కు ప్రాధాన్యత తగ్గిందనే సంకేతాలను చంద్రబాబు పంపారు. ఇలా సిఎం రమేష్ పని పూర్తయిందనుకున్న చంద్రబాబు… తరవాత వంతుగా సుజనాచౌదరిపై టార్గెట్ పెట్టాడు. అందులో భాగంగానే ఎల్లోమీడియాలో కొన్ని రోజులుగా సుజనాపై దుష్ప్రచారం చేయిస్తున్నారు. సుజనాచౌదరి టీఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖరరావుతో సన్నిహితంగా ఉంటూ… హైదరాబాదులో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు సుజనా పాల్పడుతున్నాడనే ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం ద్వారా టిడిపి శ్రేణుల్లో సుజనాపై వ్యతిరేకతను చాపకింద నీరులా చొప్పిస్తున్నారు. అంతటితో ఆగకుండా విజయవాడ మాజీ ఎంపి లగడపాటిని పార్టీలోకి తీసుకొచ్చి సుజనాకు చెక్ పెట్టాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తుంది. అందుకే మొన్న ఢిల్లీలో చంద్రబాబూ-లగడపాటి రాజగోపాల్‌ కలుసుకున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎంతో వ్యయ ప్రయాసలకొర్చి… పార్టీకి ఆర్థికంగా అండదండలందించిన సిఎం రమేష్- సుజనాచౌదరి విషయంలోనే చంద్రబాబునాయుడు ఈవిధాంగా ప్రవర్తిస్తూంటే ముందు ముందు తమ పరిస్థితీ ఇంతేనని కొంతమంది సీనియర్లు అనుకుంటున్నారు.
– సవరం నాని
Tags:    
Advertisement

Similar News