లాల్‌బహదూర్‌ది అసహజ మరణం: కుమారుడు
మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణం సహజ మరణం కాదని ఆయన కుమారుడు అనిల్ శాస్త్రి ఆరోపించారు. తన తండ్రి మరణంపై అనిల్ అనేక సందేహాలను వ్యక్తం చేశారు. ఆయన మృతదేహం నీలం రంగులోకి మారిపోయిందని గుర్తు చేశారు. తాష్కెంట్ (ఉజ్బెకిస్థాన్ రాజధాని) నగరంలో శాస్త్రి బస చేసిన గదిలో కనీసం బెల్ కానీ, ఫోన్ కానీ లేదని గుర్తు చేశారు. నాన్న మృతి చెందిన తర్వాత ఆయన డైరీ కూడా మాయమైందని పేర్కొన్నారు. శాస్త్రి […]
Advertisement
మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణం సహజ మరణం కాదని ఆయన కుమారుడు అనిల్ శాస్త్రి ఆరోపించారు. తన తండ్రి మరణంపై అనిల్ అనేక సందేహాలను వ్యక్తం చేశారు. ఆయన మృతదేహం నీలం రంగులోకి మారిపోయిందని గుర్తు చేశారు. తాష్కెంట్ (ఉజ్బెకిస్థాన్ రాజధాని) నగరంలో శాస్త్రి బస చేసిన గదిలో కనీసం బెల్ కానీ, ఫోన్ కానీ లేదని గుర్తు చేశారు. నాన్న మృతి చెందిన తర్వాత ఆయన డైరీ కూడా మాయమైందని పేర్కొన్నారు. శాస్త్రి మరణించిన సమయంలో అక్కడి భారత రాయబార కార్యాలయం కూడా నిర్లక్ష్యం వహించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన తండ్రి మరణంపై విచారణ కమిటీ వేయాలని ఆయన కేంద్రా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Advertisement