తాడ్వాయి ఎన్‌కౌంటర్ బూటకం: కోదండరాం
వరంగల్ జిల్లా తాడ్వాయి అడవులలో జరిగిన ఎన్‌కౌంటర్‌ను పరిశీలిస్తే అనుమానాలు కలుగుతున్నాయని, ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌లా అనిపిస్తోందని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం అనుమానం వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు సాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. ప్రజా సమస్యల విషయంలో తాము పోరాడతామని, అందులో అనుమానాలు అక్కర్లేదని ఆయన అన్నారు. తాను ప్రజల కోసం మాట్లాడినంత మాత్రాన రాజకీయాలలోకి వస్తానని అనుకోవద్దని ఆయన సూచించారు. […]
Advertisement
వరంగల్ జిల్లా తాడ్వాయి అడవులలో జరిగిన ఎన్‌కౌంటర్‌ను పరిశీలిస్తే అనుమానాలు కలుగుతున్నాయని, ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌లా అనిపిస్తోందని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం అనుమానం వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు సాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. ప్రజా సమస్యల విషయంలో తాము పోరాడతామని, అందులో అనుమానాలు అక్కర్లేదని ఆయన అన్నారు. తాను ప్రజల కోసం మాట్లాడినంత మాత్రాన రాజకీయాలలోకి వస్తానని అనుకోవద్దని ఆయన సూచించారు. అవన్నీ ఊహాగానాలేనని ఆయన స్పష్టం చేశారు.
Advertisement