శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆదాయం రూ. 20 కోట్లు

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. ఈ నెల 16న ప్రారంభమైన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. తొలిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. మరుసటిరోజు గవర్నర్‌ నరసింహన్‌ సతీసమేతంగా హాజరై వాహన సేవలో పాల్గొన్నారు. 20న జరిగిన గరుడోత్సవానికి దాదాపు రెండున్నర లక్షల మంది భక్తులు విచ్చేశారు. ఎనిమిది రోజుల పాటు 5 లక్షల 30 వేల మంది […]

Advertisement
Update:2015-09-24 18:35 IST
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. ఈ నెల 16న ప్రారంభమైన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. తొలిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. మరుసటిరోజు గవర్నర్‌ నరసింహన్‌ సతీసమేతంగా హాజరై వాహన సేవలో పాల్గొన్నారు. 20న జరిగిన గరుడోత్సవానికి దాదాపు రెండున్నర లక్షల మంది భక్తులు విచ్చేశారు. ఎనిమిది రోజుల పాటు 5 లక్షల 30 వేల మంది శ్రీవారి దర్శనం చేసుకున్నారని టిటిడి ఛైర్మన్‌ చదలవాడ క్రిష్ణమూర్తి, ఈవో సాంబశివరావు చెప్పారు. గత యేడాది బ్రహ్మోత్సవాల్లో హుండీ ఆదాయం 20 కోట్లు కాగా, ఈసారి 19 కోట్లు వచ్చింది. లడ్డూ విక్రయాలు గత ఏడాది 21 లక్ష 70 వేలు అమ్ముడుపోగా, ఈ ఏడాది 22 లక్షల 65 వేలు విక్రయించారు. టీటీడీ విజిలెన్స్‌, పోలీసులు కాకుండా శ్రీవారి సేవకులను 2750 మందిని బ్రహ్మోత్సవాల్లో ఉపయోగించుకున్నారు.
Tags:    
Advertisement

Similar News