భద్రతామండలిలో మద్దతివ్వండి: ప‌్రధాని
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి మద్దతివ్వాలని ప్రధాని మోదీ ఐర్లాండ్‌ను కోరారు. అమెరికా పర్యటనకు బయల్దేరిన ఆయన మార్గమధ్యలో 5 గంటలపాటు ఐర్లాండ్‌లో ఆగారు. ప్రధాని ఎండా కెన్నీతో దాదాపు 5 గంటలపాటు చర్చలు జరిపారు. అనంతరం సంయుక్త విలేకరుల సమావేశంలో సమావేశంలో మాట్లాడారు. ప్రధాని ఏమన్నారంటే.. + ఉగ్రవాదం, తీవ్రవాదం, పలు అంతర్జాతీయ అంశాలతోపాటు ఆసియా, యూరప్‌లో ప్రస్తుత పరిస్థితిపై చర్చించాం. + భారత్‌ను ఎన్ ఎన్ ఎజీ గ్రూపు నుంచి మినహాయించడంలో 2008లో […]
Advertisement
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి మద్దతివ్వాలని ప్రధాని మోదీ ఐర్లాండ్‌ను కోరారు. అమెరికా పర్యటనకు బయల్దేరిన ఆయన మార్గమధ్యలో 5 గంటలపాటు ఐర్లాండ్‌లో ఆగారు. ప్రధాని ఎండా కెన్నీతో దాదాపు 5 గంటలపాటు చర్చలు జరిపారు. అనంతరం సంయుక్త విలేకరుల సమావేశంలో సమావేశంలో మాట్లాడారు.
ప్రధాని ఏమన్నారంటే..
+ ఉగ్రవాదం, తీవ్రవాదం, పలు అంతర్జాతీయ అంశాలతోపాటు ఆసియా, యూరప్‌లో ప్రస్తుత పరిస్థితిపై చర్చించాం.
+ భారత్‌ను ఎన్ ఎన్ ఎజీ గ్రూపు నుంచి మినహాయించడంలో 2008లో ఐర్లాండ్ అందించిన సహకారానికి కృతజ్ఞతలు.
+ ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి మద్దతివ్వాలని ఆశిస్తున్నా.
+ రెండుదేశాల మధ్య ఐటీ, బయోటెక్నాలజీ, వ్యవసాయం, ఫార్మసీ, ఇంధన రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాం.
+ ఇరుదేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక, ఆర్థిక బంధాలు ఏర్పడాలని ఆశిస్తున్నాం.
కెన్నీ ఏమన్నారంటే..!
+ ఉభయ దేశాల మధ్య పర్యాటకం బలోపేతం కావాలని ఆశిస్తున్నామని కెన్నీ ఆశాభావం వ్యక్తం చేశారు.
+ భారత్ కు భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి మద్దతిస్తామని హామీ ఇస్తున్నాం.
1956 తరువాత ఐర్లాండ్‌ను సందర్శించిన తొలి ప్రధాని మోదీ కావడం విశేషం. అందుకే ఐర్లాండ్ ప్రధాని కార్యాలయం ఆయనకు ఘన స్వాగతం పలికింది. మోదీ కొన్ని బహుమతులను కెన్నీకి బహుకరించారు. ఐర్లాండ్ పిల్లలు సంస్కృత శ్లోకలతో మోదీకి స్వాగతం పలికారు. దీనిపై మోదీ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
Advertisement