సభలో కన్నీళ్లు పెట్టుకున్న గీతారెడ్డి!
తెలంగాణ అసెంబ్లీ తొలిసమావేశాల సందర్భంగా జహీరాబాద్ ఎమ్మెల్యే గీతారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇటీవల మరణించిన నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి సంతాప తీర్మానం సమయంలో ఆయన గురించి మాట్లాడిన గీతారెడ్డి ఉద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకుని కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. ఈ సందర్భంగా గీతారెడ్డి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అజాతశత్రువుగా పేరొందిన కిష్టారెడ్డి హఠాన్మరణం తనను ఎంతో ఆవేదనకు గురిచేసిందన్నారు. ఆయన మరణంతో ఖాళీ అయిన నారాయణ్‌ఖేడ్ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ఆయన కుటుంబ […]
Advertisement
తెలంగాణ అసెంబ్లీ తొలిసమావేశాల సందర్భంగా జహీరాబాద్ ఎమ్మెల్యే గీతారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇటీవల మరణించిన నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి సంతాప తీర్మానం సమయంలో ఆయన గురించి మాట్లాడిన గీతారెడ్డి ఉద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకుని కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. ఈ సందర్భంగా గీతారెడ్డి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అజాతశత్రువుగా పేరొందిన కిష్టారెడ్డి హఠాన్మరణం తనను ఎంతో ఆవేదనకు గురిచేసిందన్నారు. ఆయన మరణంతో ఖాళీ అయిన నారాయణ్‌ఖేడ్ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరిని ఎమ్మెల్యేగా నిలబెడతామని ఇందుకు సహకరించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఇదే అంశాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, చిన్నారెడ్డి, డీకే అరుణలు కూడా తమ సంతాపంలో ప్రస్తావించారు. అయితే, దీనిపై సీఎం స్పందించకపోవడం గమనార్హం.
Advertisement