2019నాటికి భారత్‌లో నిరంతర విద్యుత్: పీయూష్
దేశవ్యాప్తంగా 2019నాటికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. సమగ్ర, సుస్థిర ఇంధన ఉత్పత్తి కోసం శక్తిమంతమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. భారత్ – అమెరికా ఇంధన మంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణ సహిత అభివృద్ధి సాధించాలన్న నినాదానికే భారత్ కట్టుబడి ఉన్నదన్నారు. అందుకు అనుగుణంగా భారత్ 2022 నాటికి 175 గిగ్రావాట్ల సంప్రదాయేతర ఇంధనం, 60 గిగ్రావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన శక్తి […]
Advertisement
దేశవ్యాప్తంగా 2019నాటికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. సమగ్ర, సుస్థిర ఇంధన ఉత్పత్తి కోసం శక్తిమంతమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. భారత్ – అమెరికా ఇంధన మంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణ సహిత అభివృద్ధి సాధించాలన్న నినాదానికే భారత్ కట్టుబడి ఉన్నదన్నారు. అందుకు అనుగుణంగా భారత్ 2022 నాటికి 175 గిగ్రావాట్ల సంప్రదాయేతర ఇంధనం, 60 గిగ్రావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన శక్తి సామర్థ్యాలను పెంపొందించుకుంటుందన్నారు.
Advertisement