బాబూ నీ ర‌క్ష‌ణ‌కు కోట్లు..మా బ‌తుకుల‌కు తూట్లా?

న‌దులు అనుసంధానించేసి..ప్ర‌పంచానికే మార్గం చూపిన దార్శ‌నికుడు బాబుకు ఓ పొగాకు రైతు మ‌ర‌ణ‌వాంగ్మూలం రాశాడు. నీ ర‌క్ష‌ణ‌కు 6 కోట్లు  పెట్టి బ‌స్సు కొనుకున్న బాబూ! మా పొగాకు బ్యార‌న్  రైతుల బ‌తుకుల భ‌రోసా ఎవ‌రు ఇస్తారంటూ..లేఖ‌లో ప్ర‌శ్నించారు. వ్యాపార అవ‌కాశాల‌కు, ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న దేశంలోనే రెండోస్థానం ఇచ్చిన వ‌ర‌ల్డ్‌బ్యాంకు..వ్య‌వ‌సాయరంగం ఎంత ద‌య‌నీయంగా ఉందో మాత్రం నివేదిక ఇవ్వ‌లేదు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా దేవ‌ర‌ప‌ల్లి మండ‌లం య‌ర్న‌గూడెం గ్రామానికి చెందిన పొగాకు రైతు సింహాద్రి వెంక‌టేశ్వ‌ర‌రావు మాత్రం ఏపీలో […]

Advertisement
Update:2015-09-23 16:38 IST

న‌దులు అనుసంధానించేసి..ప్ర‌పంచానికే మార్గం చూపిన దార్శ‌నికుడు బాబుకు ఓ పొగాకు రైతు మ‌ర‌ణ‌వాంగ్మూలం రాశాడు. నీ ర‌క్ష‌ణ‌కు 6 కోట్లు పెట్టి బ‌స్సు కొనుకున్న బాబూ! మా పొగాకు బ్యార‌న్ రైతుల బ‌తుకుల భ‌రోసా ఎవ‌రు ఇస్తారంటూ..లేఖ‌లో ప్ర‌శ్నించారు. వ్యాపార అవ‌కాశాల‌కు, ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న దేశంలోనే రెండోస్థానం ఇచ్చిన వ‌ర‌ల్డ్‌బ్యాంకు..వ్య‌వ‌సాయరంగం ఎంత ద‌య‌నీయంగా ఉందో మాత్రం నివేదిక ఇవ్వ‌లేదు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా దేవ‌ర‌ప‌ల్లి మండ‌లం య‌ర్న‌గూడెం గ్రామానికి చెందిన పొగాకు రైతు సింహాద్రి వెంక‌టేశ్వ‌ర‌రావు మాత్రం ఏపీలో రైతుల ప‌రిస్థితి..పొగాకు రైతుల దుస్థితిని త‌న చివ‌రి లేఖ‌లో వివ‌రించాడు. టొబాకో బోర్డు పొగాకు కొన‌క‌, బ్యాంకు అప్పులు తీర్చ‌లేక పొగాకు రైతులు ఎలా స‌త‌మ‌తమ‌వుతున్నారో వివ‌రిస్తూ.. రాసిన లేఖ వెంక‌టేశ్వ‌ర‌రావు చ‌నిపోయిన వారం రోజుల‌కు బ‌య‌ట‌ప‌డింది. ఇప్పుడు వెంక‌టేశ్వ‌ర‌రావు రాసిన మ‌ర‌ణ‌వాంగ్మూలం ఏపీలో ప్ర‌ధాన వాణిజ్య పంట అయిన పొగాకు రాస్తున్న మ‌ర‌ణ‌శాస‌నాన్ని మ‌న క‌ళ్ల ముందు ఉంచింది. సింగ‌పూర్ టూర్‌కు కోట్లు ఖ‌ర్చుపెడుతూ, త‌న ర‌క్ష‌ణ కోసం 6 కోట్ల‌తో బ‌స్సు కొనుగోలు చేసిన బాబు.. వెంక‌టేశ్వ‌ర‌రావు లేఖ‌తోనైనా స్పందిస్తారో లేదో చూడాలి.

Tags:    
Advertisement

Similar News