నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు అధికారులు సర్వంసిద్ధం చేశారు. రేపు ఉదయం 10 గంటలకు శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, దివంగత కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డికి సంతాపం ప్రకటించనున్నాయి. అనంతరం సభ వాయిదా పడనుంది. అసెంబ్లీ ఆవరణలో మధ్యాహ్నం 12 గంటలకు బీఏసీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పోలీసులు పటిష్ట […]

Advertisement
Update:2015-09-22 18:30 IST

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు అధికారులు సర్వంసిద్ధం చేశారు. రేపు ఉదయం 10 గంటలకు శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, దివంగత కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డికి సంతాపం ప్రకటించనున్నాయి. అనంతరం సభ వాయిదా పడనుంది. అసెంబ్లీ ఆవరణలో మధ్యాహ్నం 12 గంటలకు బీఏసీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అస్త్రాలతో అధికార విపక్షాలు రెడీ
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా వంద శాతం సభకు హాజరుకావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఇవాళ జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా హాజరయ్యారు. ఆ సందర్భంగా సీఎం కేసీఆర్, నేతలతో మాట్లాడుతూ సభలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాల దగ్గర సబ్జెక్ట్ లేదని, రైతు ఆత్మహత్యలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. సభలో ప్రతిపక్షాల ప్రశ్నలకు ధీటుగా సమాధానం చెప్పాలని అసెంబ్లీ సమావేశాలకు నేతలను సమాయత్తం చేశారు. కాగా టి.టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీ కూడా సమావేశాలకు సమాయత్తమవుతున్నాయి. ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించాయి. ఓటుకు నోటు కేసుపై టీఆర్‌ఎస్‌ రాద్ధాంతం చేస్తే రైతుల ఆత్మహత్యల ప్రస్తావనతో సభను దిగ్బంధనం చేయాలని టీటీడీపీ భావిస్తోంది. అలాగే తాము చేస్తున్న ఉద్యమాలను ప్రస్తావిస్తూ టీఆర్‌ఎస్‌లోకి వలస పోయినవారి రాజీనామాలకు డిమాండు చేయాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. బీజేపీ కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి తన వంతు ప్రయత్నాలను చేస్తోంది.

Tags:    
Advertisement

Similar News