ఇంతింతై..అమ‌రావ‌తి అంతై..

ఇంతింతై వ‌టుడంతై ..అన్న‌ట్లు ..ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని రోజురోజుకూ విస్త‌రించుకుంటూ పోతున్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలోకి కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట మున్సిపాలిటీతోపాటు వివిధ మండలాల్లోని 136 గ్రామాలను, గుంటూరు జిల్లాలోని 30 గ్రామాలను కొత్త‌గా క‌లుపుతూ జీవో జారీ చేశారు. ఏపీ సర్కార్ తాజాగా స‌వ‌రించిన  సీఆర్డీఏ చ‌ట్టం ప్ర‌కారం  రాజ‌ధాని ప‌రిధి మ‌రో 1,284.49 చదరపు కిలోమీటర్లు పెరిగింది. ఇప్పటి వరకున్న 7068.20 చదరపు కిలోమీటర్లుండ‌గా,  తాజా విస్త‌ర‌ణ‌తో 8,352.69 […]

Advertisement
Update:2015-09-23 07:26 IST
ఇంతింతై వ‌టుడంతై ..అన్న‌ట్లు ..ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని రోజురోజుకూ విస్త‌రించుకుంటూ పోతున్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలోకి కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట మున్సిపాలిటీతోపాటు వివిధ మండలాల్లోని 136 గ్రామాలను, గుంటూరు జిల్లాలోని 30 గ్రామాలను కొత్త‌గా క‌లుపుతూ జీవో జారీ చేశారు. ఏపీ సర్కార్ తాజాగా స‌వ‌రించిన సీఆర్డీఏ చ‌ట్టం ప్ర‌కారం రాజ‌ధాని ప‌రిధి మ‌రో 1,284.49 చదరపు కిలోమీటర్లు పెరిగింది. ఇప్పటి వరకున్న 7068.20 చదరపు కిలోమీటర్లుండ‌గా, తాజా విస్త‌ర‌ణ‌తో 8,352.69 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల‌కు ఆ ప‌రిధి పెరిగింది.
కృష్ణాజిల్లాలో గ్రామాలు ఇవే..
జగ్గయ్యపేట మున్సిపాల్టీతోపాటు జ‌గ్గ‌య్య‌పేట‌ మండలంలోని 24 గ్రామాలు, వత్సవాయి మండలంలో 26, పెనుగంచిప్రోలులో 12, మైలవరంలో 4, నూజివీడు 2, బాపులపాడులో 3, మొవ్వలో7, ఘంటశాలలో 9, చల్లపల్లిలో 2, మోపిదేవిలో 7, పామర్రులో10, నందివాడ10, గుడివాడలో 6, నందిగామ మండలంలో ఒక గ్రామం సీఆర్డీఏలో కలిశాయి.
గుంటూరు జిల్లాలో గ్రామాలు..
గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలో 6, క్రోసూరులో 5, సత్తెనపల్లిలో 2, ఫిరంగిపురంలో 3, యడ్లపాడులో 2, ప్రత్తిపాడులో 1, పొన్నూరులో 3, భట్టిప్రోలులో 8 గ్రామాలు సీఆర్డీఏలో కలిశాయి.
సీఆర్‌డీఏ నుంచి త‌ప్పించిన గ్రామాలు ఇవే..
రెండు జిల్లాల్లోని తొమ్మిది గ్రామాలను సీఆర్డీఏ పరిధి నుంచి తప్పించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలోని 6, గుంటూరు జిల్లాలో పెదనందిపాడు మండలం గొరిజవోలుగుంటపాలెం, నాదెండ్ల మండలంలోని నాదెండ్ల, ముప్పాళ్ళ మండలంలోని మాదల గ్రామాలను తప్పించారు.
Tags:    
Advertisement

Similar News