27న సూపర్‌మూన్.. చంద్రగ్రహణం !
ఈ నెల 27న ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. ఆ రోజు కొన్ని గంటల తేడాతో ఆకాశంలో రెండు వింతలు చోటు చేసుకోనుండటం విశేషం. 27న రాత్రి కనిపించే చందమామ ప్రతిరోజు కనిపించే చంద్రుడి కంటే చాలా పెద్ద పరిమాణంలో, భూమికి దగ్గరగా కనిపిస్తాడు. తెల్లవారుజామున చంద్రగ్రహణం సంభవించనుంది. దాదాపు 33 ఏళ్ల తరువాత ఈ రెండు అద్భుతాలు ఒకేరోజు జరగడం విశేషం. 1982లో ఇలాగే సూపర్‌మూన్, చంద్రగ్రహణం ఒకేసారి కనువిందు చేయగా, మళ్లీ ఈనెల 27న […]
Advertisement
ఈ నెల 27న ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. ఆ రోజు కొన్ని గంటల తేడాతో ఆకాశంలో రెండు వింతలు చోటు చేసుకోనుండటం విశేషం. 27న రాత్రి కనిపించే చందమామ ప్రతిరోజు కనిపించే చంద్రుడి కంటే చాలా పెద్ద పరిమాణంలో, భూమికి దగ్గరగా కనిపిస్తాడు. తెల్లవారుజామున చంద్రగ్రహణం సంభవించనుంది. దాదాపు 33 ఏళ్ల తరువాత ఈ రెండు అద్భుతాలు ఒకేరోజు జరగడం విశేషం. 1982లో ఇలాగే సూపర్‌మూన్, చంద్రగ్రహణం ఒకేసారి కనువిందు చేయగా, మళ్లీ ఈనెల 27న మరోసారి అలరించనున్నాయి. ఆ రోజు చందమామ భూమికి దగ్గరగా వస్తాడు. మామూలుగా కనిపించే చంద్రుడి కన్నా 14 శాతం పెద్దగా, 30 ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అందుకే దీన్ని సూపర్‌మూన్‌గా అభివర్ణిస్తారు. ఈ అవకాశం ప్రపంచంలో కొన్ని ప్రాంతాల వారు మాత్రమే వీక్షించగలరు.
Advertisement