అమరావతిలో ఈఎస్‌ఐ, విశాఖలో ఆస్పత్రి అప్‌గ్రేడ్
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 300 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రికి, విశాఖలో 100 పడకల ఆస్పత్రి విస్తరణకు కేందం ఆమోదం తెలిపింది. 300 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి కేంద్ర కార్మిక శాఖ ఆమోదం తెలిపినట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఢిల్లీలో మీడియాకు తెలిపారు. ఏపీ ప్రభుత్వం స్థలం కేటాయిస్తే భవన నిర్మాణం వెంటనే ప్రారంభిస్తామన్నారు. వైజాగ్‌లో ఉన్న 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రిని కూడా 300 పడకల ఆసుపత్రిగా విస్తరించడానికి చర్యలు తీసుకుంటామని […]
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 300 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రికి, విశాఖలో 100 పడకల ఆస్పత్రి విస్తరణకు కేందం ఆమోదం తెలిపింది. 300 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి కేంద్ర కార్మిక శాఖ ఆమోదం తెలిపినట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఢిల్లీలో మీడియాకు తెలిపారు. ఏపీ ప్రభుత్వం స్థలం కేటాయిస్తే భవన నిర్మాణం వెంటనే ప్రారంభిస్తామన్నారు. వైజాగ్‌లో ఉన్న 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రిని కూడా 300 పడకల ఆసుపత్రిగా విస్తరించడానికి చర్యలు తీసుకుంటామని దత్తాత్రేయ తెలిపారు.