Wonder World 33

పక్షుల నుంచి విమానాలను రక్షించే పరికరం! ఎంత పెద్ద విమానమైనా చిన్న పక్షిని చూస్తే గడగడ వణికిపోవలసిందే. పక్షులను చూస్తే విమానాలు భయపడడమేమిటి? అసలు పక్షులకు విమానాలకు మధ్య వైరమేమిటి? అనుకుంటున్నారా… ముందు భాగంలో ఉండే ఇంజన్‌లో పక్షులు ఇరుక్కుపోవడం వల్ల చాలా విమానాలు కూలిపోతుంటాయి. బర్డ్‌హిట్‌ అని దీనికి పేరు. ఇలా జరుగుతున్న ప్రమాదాల వల్ల ఏటా అనేక విమానాలు కూలిపోతుండడంతో వైమానిక సిబ్బందితో సహా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. […]

Advertisement
Update:2015-09-20 18:34 IST

పక్షుల నుంచి విమానాలను రక్షించే పరికరం!

ఎంత పెద్ద విమానమైనా చిన్న పక్షిని చూస్తే గడగడ వణికిపోవలసిందే. పక్షులను చూస్తే విమానాలు భయపడడమేమిటి? అసలు పక్షులకు విమానాలకు మధ్య వైరమేమిటి? అనుకుంటున్నారా… ముందు భాగంలో ఉండే ఇంజన్‌లో పక్షులు ఇరుక్కుపోవడం వల్ల చాలా విమానాలు కూలిపోతుంటాయి. బర్డ్‌హిట్‌ అని దీనికి పేరు. ఇలా జరుగుతున్న ప్రమాదాల వల్ల ఏటా అనేక విమానాలు కూలిపోతుండడంతో వైమానిక సిబ్బందితో సహా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఈ బర్డ్‌ హిట్‌ ఉపద్రవాన్నుంచి విమానాలను కాపాడడానికి ఏం చేయాలా అనే దానిపై చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇపుడు కొత్తగా ఒక ఉపకరణాన్ని కనుగొన్నారు. ఈ పరికరం తక్కువ ఫ్రీక్వెన్సీలో శబ్ద తరంగాలను విడుదల చేస్తుంది. ఆ శబ్దాలు మనుషులకు వినిపించవు. పక్షులకు మాత్రమే వినిపిస్తాయి. దాంతో పక్షులు విమానాలు ప్రయాణించే మార్గం నుంచి పక్కకు వెళ్లిపోతాయి. విమానాశ్రయాల దగ్గరలో పక్షులను రాకుండా చేయడం కోసం పెద్దపెద్ద శబ్దాలు చేస్తుండేవారు. వాటివల్ల మనుషుల చెవులకు చిల్లులు పడుతుండేవి. మనకు వినబడకుండా పక్షులు మాత్రం బెదిరిపోయే ఫ్రీక్వెన్సీలో శబ్ద తరంగాలను విడుదల చేసే పరికరాన్ని లూసియానా లోని లాప్లేస్‌లో గల టెక్నాలజీ ఇంటర్నేషనల్‌ సంస్థ రూపొందించింది. ఈ పరికరం ప్రయోగదశలో అన్ని రకాల పరీక్షలలోనూ సఫలమయ్యిందని న్యూ సైంటిస్ట్‌ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

Tags:    
Advertisement

Similar News