ఇసుక మాఫియా ఆరా తీయండి: హైకోర్టు ఆదేశం
తెలంగాణలో ఇసుక మాఫియాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరీంనగర్ జిల్లాలో ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు జిల్లా ఎస్పీని ఆదేశించింది. సీజ్ చేసిన వాహనాలను కింది కోర్టు అనుమతితో తీసుకెళ్లకుండా నిబంధనలను కఠినతరం చేయాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఇసుక మాఫియా వెనుక ఎవరెవరు ఉన్నారో స్పష్టం చేయాలని ఎస్పీని ఆదేశించింది. దీనిపై కరీంనగర్ ఎస్పీ వివరణ ఇస్తూ ఇప్పటి వరకు 54 కేసులు నమోదు చేశామని న్యాయస్థానానికి తెలిపారు. ఈ కేసు […]
Advertisement
తెలంగాణలో ఇసుక మాఫియాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరీంనగర్ జిల్లాలో ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు జిల్లా ఎస్పీని ఆదేశించింది. సీజ్ చేసిన వాహనాలను కింది కోర్టు అనుమతితో తీసుకెళ్లకుండా నిబంధనలను కఠినతరం చేయాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఇసుక మాఫియా వెనుక ఎవరెవరు ఉన్నారో స్పష్టం చేయాలని ఎస్పీని ఆదేశించింది. దీనిపై కరీంనగర్ ఎస్పీ వివరణ ఇస్తూ ఇప్పటి వరకు 54 కేసులు నమోదు చేశామని న్యాయస్థానానికి తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణ హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది.
Advertisement