ఎలుకలు కొరికేసిన మహిళ వేళ్ళు
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి ఎలుకలు స్వైర విహారం చేశాయి. ఆర్దోపెడిక్ వార్డులో చికిత్స పొందుతున్న రోశమ్మ(40) అనే మహిళ చేతి వేళ్లను ఎలుకలు కొరికేశాయి. గతనెలలో ఇదే ఆస్పుత్రిలో ఓ పసికందును ఎలుకలు కొరికి చంపేసిన సంఘటన మరిచిపోకముందే పాములు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జరిగి 48 గంటలు గడవక ముందే ఎలుకలు మరో మహిళ చేతి వేళ్లను తినేశాయి. దాంతో ఆమెను అత్యవసర చికిత్సా విభాగానికి తరలించారు. రోశమ్మ జిజిహెచ్‌లోని […]
Advertisement
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి ఎలుకలు స్వైర విహారం చేశాయి. ఆర్దోపెడిక్ వార్డులో చికిత్స పొందుతున్న రోశమ్మ(40) అనే మహిళ చేతి వేళ్లను ఎలుకలు కొరికేశాయి. గతనెలలో ఇదే ఆస్పుత్రిలో ఓ పసికందును ఎలుకలు కొరికి చంపేసిన సంఘటన మరిచిపోకముందే పాములు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జరిగి 48 గంటలు గడవక ముందే ఎలుకలు మరో మహిళ చేతి వేళ్లను తినేశాయి. దాంతో ఆమెను అత్యవసర చికిత్సా విభాగానికి తరలించారు. రోశమ్మ జిజిహెచ్‌లోని ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స పొందుతోంది. తెల్లవారుజామున ఆమెపై ఎలుకల గుంపు దాడి చేశాయి. ఈ విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకువెళ్ళడంతో వారు అత్యవసర చికిత్సా విభాగానికి తరలించి ఆమెకు వైద్యం చేశారు. ఈ సంఘటనతో వార్డులోని రోగులు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటివరకు ఆస్పత్రిలో సుమారు 400 ఎలుకలను పట్టుకున్నారు. అయినా ఎలుకలు వస్తుండటంతో పేషెంట్లు ఆందోళన చెందుతున్నారు.
Advertisement