దాల్మియా ఇకలేరు!
బీసీసీఐ ఛైర్మన్ జగ్‌మోహన్ దాల్మియా (75) కన్ను మూశారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కోల్‌కతాలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు. గత గురువారం దాల్మియాకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బీఎం బిర్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. భారత క్రికెట్ మాకియవెల్లి అని ఆయనకు బిరుదు కూడా ఉంది.ఆయన మృతికి బీసీసీఐ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేసింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దాల్మియా కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఆయనకు భార్య, […]
Advertisement
బీసీసీఐ ఛైర్మన్ జగ్‌మోహన్ దాల్మియా (75) కన్ను మూశారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కోల్‌కతాలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు. గత గురువారం దాల్మియాకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బీఎం బిర్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. భారత క్రికెట్ మాకియవెల్లి అని ఆయనకు బిరుదు కూడా ఉంది.ఆయన మృతికి బీసీసీఐ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేసింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దాల్మియా కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 1940, మే 30న కోల్‌కతాలో దాల్మియా జన్మించారు. బీసీసీఐకి జగ్‌మోహన్ దాల్మియా స్థాయిలో ఇతరులెవరూ సేవలందించలేదంటే..అతిశయోక్తి కాదు! బీసీసీఐ అభ్యున్నతికి ఆయన అహర్నిశలు శ్రమించారు. బీసీసీఐ నేడు ఆర్థికంగా ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో ఉందంటే.. అదంతా జగ్‌మోహన్ దాల్మియా పుణ్యమే! దాదాపు 36 సంవత్సరాల పాటు ఆయన బీసీసీఐలో వివిధ పదవులు నిర్వహించారు. 1983లో బీసీసీఐ కోశాధికారిగా పనిచేశారు. 1987, 1996 క్రికెట్ ప్రపంచకప్‌ను భారత్‌లో జరగడం వెనక ఆయన కృషి ఎంతో ఉంది. 1997లో ఐసీసీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. 2001 నుంచి 2004 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా సేవలందించారు. 2015, మార్చి 2న జగ్‌మోహన్ దాల్మియా మరోసారి బీసీసీఐ పగ్గాలు చేపట్టారు.
ప్రముఖుల నివాళి!
బీసీసీఐపై చెరగని ముద్ర వేసిన దాల్మియా మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. వీరిలో రాష్ర్ట పతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, ఐసీసీ పెద్దలు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, అనిల్ కుంబ్లే, కామెంటేటర్ హర్షాభోగ్లే , వీవీఎస్ లక్ష్మణ్, ప్రజ్ఞాన్ ఓజా, రవిచంద్రన్ అశ్విన్ తదితర క్రీడాకారులు, బీసీసీఐ పెద్దలు, పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నారు.
Advertisement