కేఎఫ్‌సీ ఉత్పత్తులు తినకండి: విరాట్, సానియా!
ఆరోగ్యానికి హాని కలిగించే జంక్ ఫుడ్, కేఎఫ్‌సీ ఉత్పత్తులను తినవద్దని భారత టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, టెన్నిస్‌స్టార్ సానియా మీర్జా యువతకు పిలుపునిచ్చారు. బెంగళూరులో జరిగిన అడిడాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేఎఫ్‌సీ ఉత్పత్తులు, కూల్‌డ్రింకులు, చాక్లెట్లు మంచి రుచి కలిగి ఉంటాయని, కానీ దేహానికి చేటు చేస్తాయని హెచ్చరించారు. వీటిని తింటే బాడీ ఫిట్‌నెస్ పోతుందని వివరించారు. ఎంతో కష్టపడి, ఎన్నో త్యాగాలు […]
Advertisement
ఆరోగ్యానికి హాని కలిగించే జంక్ ఫుడ్, కేఎఫ్‌సీ ఉత్పత్తులను తినవద్దని భారత టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, టెన్నిస్‌స్టార్ సానియా మీర్జా యువతకు పిలుపునిచ్చారు. బెంగళూరులో జరిగిన అడిడాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేఎఫ్‌సీ ఉత్పత్తులు, కూల్‌డ్రింకులు, చాక్లెట్లు మంచి రుచి కలిగి ఉంటాయని, కానీ దేహానికి చేటు చేస్తాయని హెచ్చరించారు. వీటిని తింటే బాడీ ఫిట్‌నెస్ పోతుందని వివరించారు. ఎంతో కష్టపడి, ఎన్నో త్యాగాలు చేస్తే గానీ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగలేరని కోహ్లీ అన్నారు. వారిని విమర్శించే ముందు అభిమానులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. తాను 12 ఏళ్ల వయసులో రోజుకు 6.30 గంటలు సాధన చేసేదానినని, అందుకే అంత చిన్నవయసులోనే తనతో అడిడాస్ ఒప్పందం కుదుర్చుకుందని సానియా గుర్తు చేసుకున్నారు.
Advertisement