దానంపై టీఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, హైదరాబాద్‌లో కీలక నేత దానం నాగేందర్ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇటీవల ఆయన టీఆర్‌ఎస్ మంత్రి హరీష్‌రావును కలిసినపుడు ఆయన చేరిక వ్యవహారంపై చర్చలు జరిగాయని, చేరికకు తుది రూపం వచ్చిందని చెబుతున్నారు. రానున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలాగైనా పార్టీలోకి రప్పించాలని టీఆర్‌ఎస్ శతధా ప్రయత్నించి మొత్తం మీద సక్సెస్ అయినట్టు తెలుస్తోంది. దానం చేరికకు మధ్యవర్తిగా నగరంలో ఉండే మరో కీలకనేత, మంత్రి తలసాని […]
Advertisement
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, హైదరాబాద్‌లో కీలక నేత దానం నాగేందర్ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇటీవల ఆయన టీఆర్‌ఎస్ మంత్రి హరీష్‌రావును కలిసినపుడు ఆయన చేరిక వ్యవహారంపై చర్చలు జరిగాయని, చేరికకు తుది రూపం వచ్చిందని చెబుతున్నారు. రానున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలాగైనా పార్టీలోకి రప్పించాలని టీఆర్‌ఎస్ శతధా ప్రయత్నించి మొత్తం మీద సక్సెస్ అయినట్టు తెలుస్తోంది. దానం చేరికకు మధ్యవర్తిగా నగరంలో ఉండే మరో కీలకనేత, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మధ్యవర్తిత్వం నెరపినట్టు వినవస్తోంది. రెండు మూడు రోజుల్లో దానం టీఆర్‌ఎస్‌లో చేరతారని విశ్వసనీయవర్గాల కథనం. దానం కూడా కాంగ్రెస్‌లో పెద్ద ప్రాధాన్యం లేకుండా ఉన్నారు. ఆయనకు నగరంలో ఉన్న బలం ప్లస్ పాయింట్. దీన్ని దృష్టిలో పెట్టుకునే దానం నాగేందర్‌ను ఎలాగైనా పార్టీలోకి ఆహ్వానించాలని, ఆయన్ని ఆకర్షించడానికి ఎలాంటి మార్గాన్నైనా అనుసరించాలని టీఆర్‌ఎస్ భావించడంతో చేరికకు మార్గం సుగమం అయినట్టు తెలుస్తోంది.
Advertisement