గ్రామీణ క్రికెటర్లకు టీసీఏ ఊతం
గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు టీసీఏ నడుం బిగించిందని తెలంగాణ క్రికెట్ సంఘం (టీసీఏ) అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తెలిపారు. తెలంగాణ జిల్లాల్లోని క్రికెట్ పరిరక్షణ కోసం ఏర్పాటైన తమ సంఘానికి బీసీసీఐ గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీసీఏ 2015-16 సీజన్ కేలండర్‌ను సంఘం కోశాధికారి గురువారెడ్డి, వైస్ చైర్మన్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ప్యాట్రన్ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిసి ఆయన విడుదల చేశారు. […]
Advertisement
గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు టీసీఏ నడుం బిగించిందని తెలంగాణ క్రికెట్ సంఘం (టీసీఏ) అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తెలిపారు. తెలంగాణ జిల్లాల్లోని క్రికెట్ పరిరక్షణ కోసం ఏర్పాటైన తమ సంఘానికి బీసీసీఐ గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీసీఏ 2015-16 సీజన్ కేలండర్‌ను సంఘం కోశాధికారి గురువారెడ్డి, వైస్ చైర్మన్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ప్యాట్రన్ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిసి ఆయన విడుదల చేశారు. సీనియర్ కోచ్ అబిద్ అలీ నేతృత్వంలోని కోచ్‌ల బృందం వచ్చేనెల 9న బాధ్యతలు స్వీకరిస్తుందన్నారు. టీసీఏ మొదటి అకాడమీని రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. వచ్చేనెల 22న అకాడమీని ప్రారంభించి రాష్ట్ర సీనియర్ టీమ్‌కు అక్కడ శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Advertisement