బీహార్ లో ప‌టేళ్ల భారీ ర్యాలీలు!

ఓబీసీ హోదా కోసం ఉద్య‌మిస్తున్న ప‌టేళ్లు వ్యూహం మార్చారు. త‌మ ఆందోళ‌న‌ను అర్థం చేసుకోవ‌డం లేద‌ని బీజేపీపై ఆగ్ర‌హంతో ఈ వ‌ర్గం  బీహార్‌లో త‌మ స‌త్తా చాటాల‌ని తాజాగా నిర్ణ‌యించింది. ఇందుకోసం పాటిదార్ అనామ‌త్ ఆందోళ‌న్ స‌మితి (పాస్‌) అధ్యక్షుడు హార్థిక్ ప‌టేల్  బీహార్‌లో నాలుగు భారీ ర్యాలీల‌ను చేప‌ట్టాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌భుత్వం త‌మ డిమాండును ప‌క్క‌న పెట్టి వేధింపుల‌కు పాల్ప‌డుతున్నందుకు నిర‌స‌న‌గా ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారని స‌మాచారం. ‘మేం మొత్తం రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేస్తాం’ […]

Advertisement
Update:2015-09-19 06:53 IST
ఓబీసీ హోదా కోసం ఉద్య‌మిస్తున్న ప‌టేళ్లు వ్యూహం మార్చారు. త‌మ ఆందోళ‌న‌ను అర్థం చేసుకోవ‌డం లేద‌ని బీజేపీపై ఆగ్ర‌హంతో ఈ వ‌ర్గం బీహార్‌లో త‌మ స‌త్తా చాటాల‌ని తాజాగా నిర్ణ‌యించింది. ఇందుకోసం పాటిదార్ అనామ‌త్ ఆందోళ‌న్ స‌మితి (పాస్‌) అధ్యక్షుడు హార్థిక్ ప‌టేల్ బీహార్‌లో నాలుగు భారీ ర్యాలీల‌ను చేప‌ట్టాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌భుత్వం త‌మ డిమాండును ప‌క్క‌న పెట్టి వేధింపుల‌కు పాల్ప‌డుతున్నందుకు నిర‌స‌న‌గా ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారని స‌మాచారం. ‘మేం మొత్తం రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేస్తాం’ అని కేంద్రాన్ని హెచ్చ‌రించారు. ఓబీసీ కోటా కోసం ఉద్య‌మించిన స‌మ‌యంలో ప్రాణాలు కోల్పోయిన ‘న‌లుగురు యువ‌కుల మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మైన వారిని క్ష‌మించ‌బోమ‌ని’ స్ప‌ష్టం చేశారు. బీహార్‌లో ప‌టేళ్ల స‌త్తా చాటేందుకు 197 మంది పాటిదార్ అనామ‌త్ ఆందోళ‌న్ స‌మితి క‌న్వీన‌ర్ల‌తో గుజ‌రాత్‌లో స‌మావేశం కానున్నామ‌ని హార్దిక్ తెలిపారు. ర్యాలీని విజ‌య‌వంతం చేయ‌డానికి మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ రాష్ట్రాల నుంచి ప‌టేల్ న‌వ‌నిర్మాణ్ సేన ఆధ్వ‌ర్యంలో భారీగా ప‌టేల్ కులానికి చెందిన ప్ర‌జ‌లు బీహార్‌కు చేరుకుంటార‌ని పేర్కొన్నారు. ‘బీహార్ సీఎం మ‌న వాడే’ అని హర్దిక్ ధీమా వ్య‌క్తం చేశారు. కేంద్రానికి వ్య‌తిరేకంగా సాగుతున్న ఈ ఉద్య‌మానికి బీహార్ సీఎం నితీశ్ ఇప్ప‌టికే మ‌ద్ద‌తు ప‌లికారు. అయితే ఈ ర్యాలీకి అనుమ‌తి వ‌స్తుందా అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కమే. ఆగ‌స్టు 25న ప‌టేల్ సామాజిక వ‌ర్గం ఆధ్వ‌ర్యంలో త‌ల‌పెట్టిన ఆందోళ‌న హింసారూపం దాల్చిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో 10 మంది మ‌ర‌ణించారు. ఆ త‌రువాత పాటిదార్ అనామ‌త్ ఆందోళ‌న్ స‌మితి త‌ల పెట్టిన ప‌లు ఆందోళ‌న‌ల‌కు శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతాయ‌న్న కార‌ణంగా గుజ‌రాత్ పోలీసులు అనుమ‌తులు ఇవ్వ‌డం లేదు. బీహార్ ఎన్నిక‌ల్లో బీజేపీకి ప‌టేల్ ఓట‌ర్ల‌ను దూరంగా ఉంచ‌డానికే ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు!
Tags:    
Advertisement

Similar News